స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఈశ్వర్ సినిమా నుంచి కల్కి 2898 ఏడీ (Kalki 2898 AD) సినిమా వరకు ప్రతి సినిమా కోసం ఎంతో కష్టపడిన సంగతి తెలిసిందే. ప్రభాస్ సాహో సినిమా ప్రమోషన్స్ సమయంలో మహాభారతంలో కర్ణుడు, అర్జునుడు పాత్రలంటే ఇష్టమని మహాభారతంలో ఛాన్స్ వస్తే కర్ణుడి పాత్రలో నటిస్తానని ప్రభాస్ చెప్పారు. అప్పుడు ప్రభాస్ చెప్పిన మాటను కల్కి 2898 ఏడీ సినిమాతో నిజం చేశారు. భవిష్యత్తులో ప్రభాస్ అర్జునుడి పాత్రలో సైతం కనిపిస్తారేమో చూడాలి.
ప్రభాస్ ఏ పాత్ర ఇచ్చినా అద్బుతమైన నటనతో ఆకట్టుకుంటున్నారని నెటిజన్ల నుంచి కామెంట్స్ వినిపిస్తున్నాయి. ప్రభాస్ వరుసగా పౌరాణిక పాత్రల్లో నటిస్తుండటం ఫ్యాన్స్ కు సంతోషాన్ని కలిగిస్తోంది. ప్రభాస్ తన సినిమాల ప్రమోషన్స్ కు దూరంగా ఉన్నా తన సినిమాల బిజినెస్, సక్సెస్ విషయంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రభాస్ రాబోయే రోజుల్లో మరిన్ని క్రేజీ ప్రాజెక్ట్ లను ప్రకటించనున్నారని సమాచారం అందుతోంది.
ఒక్కో సినిమాకు 100 నుంచి 150 కోట్ల రూపాయల రేంజ్ లో ప్రభాస్ పారితోషికం అందుకుంటున్నారు. టాలీవుడ్ ఇండస్ట్రీలోని అన్ని ప్రముఖ బ్యానర్లలో ప్రభాస్ నటిస్తుండటం గమనార్హం. నెక్స్ట్ లెవెల్ స్క్రిప్ట్ లతో, లార్జర్ దన్ లైఫ్ క్యారెక్టర్లతో ప్రభాస్ ప్రేక్షకులకు దగ్గరవుతున్నారు. ప్రభాస్ సినిమాలు సులువుగానే 700 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్లను సొంతం చేసుకుంటూ ఉండటం గమనార్హం. ప్రభాస్ యంగ్ డైరెక్టర్లతో బాక్సాఫీస్ ను షేక్ చేసే హిట్లు సాధిస్తున్నారు.
ప్రభాస్ తో పాటు మరి కొందరు టాలీవుడ్ హీరోలు సైతం ఇండస్ట్రీని షేక్ చేసే హిట్లు సాధిస్తున్నారు. ప్రభాస్ సరికొత్త కథాంశాలను ఎంచుకుంటూ ఫ్యాన్స్ కు అంతకంతకూ దగ్గరవుతున్నారు. ప్రభాస్ సినిమాలు విజువల్ వండర్స్ గా తెరకెక్కుతుండటంతో ఈ సినిమాలు బిజినెస్ పరంగా కూడా అదరగొడుతున్నాయి. ప్రభాస్ సినిమాలు నార్త్ ఇండియాలో కూడా రికార్డ్ స్థాయిలో కలెక్షనను సాధిస్తున్నాయి.