పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) ఏడాది కాలంలో 3 సినిమాలు రిలీజ్ చేశాడు. టాలీవుడ్లో ఏ స్టార్ హీరో కి కూడా సాధ్యం కాని ఫీట్ ఇది. సాధారణంగా టాలీవుడ్ స్టార్ హీరోలు 2 ఏళ్లకు ఒక సినిమా అన్నట్టు బద్దకంగా పనిచేస్తున్నారు. వాస్తవానికి ప్రభాస్..కి ఇంకా బద్ధకం ఎక్కువ.. అయినప్పటికీ అతను ఫాస్ట్ గా సినిమాలు చేస్తున్నాడు. గ్యాప్ లేకుండా షూటింగ్లలో పాల్గొంటున్నాడు. ‘ఆదిపురుష్’ (Adipurush) రిలీజ్ అయిన 6 నెలలకి ‘సలార్’ (Salaar) తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.
అలాగే ‘సలార్’ రిలీజ్ అయ్యి 7 నెలలు గడవక ముందే ‘కల్కి 2898 ad ‘ (Kalki 2898 AD) తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మరోపక్క మారుతి (Maruthi Dasari) దర్శకత్వంలో ‘రాజా సాబ్’ ని (The Rajasaab) కూడా ఫాస్ట్ గా సిద్ధం చేస్తున్నాడు. అలాగే హను రాఘవపూడి (Hanu Raghavapudi) దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి డేట్స్ కూడా ఇచ్చేసాడు. ఇవి ఇలా ఉండగానే ‘సలార్ 2’ షూటింగ్ కి కూడా రెడీ అయిపోతున్నాడు ప్రభాస్. ఈ సినిమా కోసం ప్రభాస్ 46 రోజులు కాల్షీట్స్ ఇచ్చాడని సమాచారం.
‘సలార్ 2 ‘ షూటింగ్ కూడా 40 శాతం కంప్లీట్ అయ్యింది. ఇక బ్యాలెన్స్ షూటింగ్ ను ఆగస్టు 10 నుండి మొదలు పెట్టబోతున్నారు. నవంబర్ లేదా డిసెంబర్ కి షూటింగ్ కంప్లీట్ చేసేయాలని ప్రశాంత్ నీల్ భావిస్తున్నాడు. ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలుపెడతాడు. సమాంతరంగా ఎన్టీఆర్ సినిమాను కూడా స్టార్ట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.