Kalki 2898 AD: ‘కల్కి 2898 ad’ నుండి డిలీట్ చేసిన సన్నివేశాలు చూశారా?
- September 1, 2024 / 12:49 PM ISTByFilmy Focus
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) హీరోగా నాగ్ అశ్విన్ (Nag Ashwin) దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘కల్కి 2898 ad’ (Kalki 2898 AD) . జూన్ 27న రిలీజ్ అయిన ఈ చిత్రం మొదటి షోతోనే సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. బాక్సాఫీస్ వద్ద ఎవ్వరూ ఊహించని విధంగా రూ.1100 కోట్ల గ్రాస్ ను కొల్లగొట్టింది. ఇటీవల ఓటీటీలో విడుదలవ్వగా.. ఇక్కడ కూడా మంచి రెస్పాన్స్ ను రాబట్టుకుంది. ‘వైజయంతి మూవీస్’ బ్యానర్ పై సి.అశ్వినీదత్ (C. Aswani Dutt) ఈ చిత్రాన్ని రూ.600 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందించారు.
Kalki 2898 AD

అతని కూతుర్లు స్వప్న దత్ (Swapna Dutt) , ప్రియాంక దత్ (Priyanka Dutt)..లు కూడా ఈ చిత్రానికి సహా నిర్మాతలుగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా.. తాజాగా ‘కల్కి 2898 ad’ నుండి డిలీటెడ్ సీన్స్ ని వదిలింది చిత్ర బృందం. 3 నిమిషాల నిడివి కలిగిన ఈ డిలీటెడ్ సీన్స్ లో.. ‘రాయ అనే పాత్రని బౌంటీ హంటర్స్ బంధించి తీసుకెళ్లడం, అదే టైంలో వాళ్ళు అమ్మాయిలని బానిసలుగా చేసుకుని లయ పరుచుకోవడం వంటివి చూపించారు.

మరోపక్క రాయ, అశ్వద్ధామ పాత్రల మధ్య చిన్నపాటి సంభాషణలకి సంబంధించిన విజువల్స్ కూడా ఇందులో ఉన్నాయి. ‘నీకు చావు లేదు అంటే.. తల నరికేసినా నువ్వు మాట్లాడగలవా?’ అంటూ అశ్వద్దామని ఆమె ప్రశ్నించడం కొంచెం ఇబ్బందిగా అనిపించే విధంగా ఉన్నాయి. అలాగే దుల్కర్ సల్మాన్.. భైరవ చిన్నప్పటి విజువల్స్ ఇంకా కొన్ని ఉన్నాయి.

అలాగే కమాండర్ మానస్ కి సంబంధించిన విజువల్స్ కూడా ఉన్నాయి. ఇక మరియమ్మ పోరాట సన్నివేశాల్ని సైతం డిలీట్ చేసినట్లు తెలుస్తుంది. మొత్తంగా ఇందులో ఏవీ పెద్ద ఇంపాక్ట్ క్రియేట్ చేసే విధంగా లేవు. డిలీట్ చేసి మంచి పనే చేశారు అని చెప్పాలి. అప్పటికే ‘కల్కి..’ రన్ టైం 3 గంటల వరకు ఉన్న సంగతి తెలిసిందే.















