ప్రపంచవ్యాప్తంగా ఇంకా ‘నాటు నాటు’ ఫీవర్ నడుస్తోంది.. ఇప్పటికీ పలువురు సెలబ్రిటీలు మరి ముఖ్యంగా క్రికెటర్స్ ఈ పాటకు కాలు కదుపుతున్నారు.. దర్శకధీరుడు రాజమౌళి ఏళ్ల తరబడి ఊహించడానికే కష్టం అనుకున్న తెలుగు సినిమాకి, ఇండియాలోనే మొట్ట మొదటి ఆస్కార్ అవార్డ్ తెచ్చిపెట్టారు.. ప్రపంచపటంలో తెలుగు సినిమాకి స్థానం కల్పించారు.. 95వ అకాడమీ అవార్డ్స్‌లో ‘బెస్ట్ ఒరిజినల్ సాంగ్’ కేటగిరీలో ‘నాటు నాటు’ ఆస్కార్ కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే..
ఈ అరుదైైన, చరిత్రలో నిలిచిపోయే ఘనత సాధించిన కీరవాణి, చంద్రబోస్, కాల భైరవ, రాహుల్ సిప్లిగంజ్, ప్రేమ్ రక్షిత్ తదితరులకు విశ్వవ్యాప్తంగా ఉన్న తెలుగు వారు, సినీ, రాజకీయ ప్రముఖులు సామాజిక మాధ్యమాల ద్వారా విషెస్ తెలియజేస్తున్నారు.. ఆస్కార్ ఏమీ అంత ఈజీగా రాలేదు.. దీని కోసం ‘ఆర్ఆర్ఆర్’ టీం.. ముఖ్యంగా రాజమౌళి అండ్ ఫ్యామిలీ ఎంతో కృషి చేశారు.. కోటాను కోట్లు ఖర్చు పెట్టి దేశ విదేశాల్లో సినిమాను ప్రదర్శించి.. కమిటీ దృష్టిలో పడేలా చేశారు..
దీని కోసం లాస్ ఏంజెల్స్‌లో ఓ ఇంటిని కూడా వారు అద్దెకు తీసుకున్నారు.. గోల్డెన్ గ్లోబ్‌తో సహా పలు అంతర్జాతీయ అవార్డులు ‘నాటు నాటు’ కి సలాం కొట్టాయి.. ఎట్టకేలకు హిస్టరీ క్రియేట్ చేశారు టీమ్.. తాజాగా ఇండియన్ మైఖేల్ జాక్సన్, స్టార్ కొరియోగ్రాఫర్ కమ్ డైరెక్టర్ ప్రభుదేవా ట్రిపులార్ బృందానికి తన శుభాకాంక్షలు తెలియజేశారు.. తన టీమ్‌తో కలిసి ‘నాటు నాటు’ పాటకు మూమెంట్స్ వేసి.. రెడ్ హార్ట్ సింబల్స్‌తో విషెస్ చెప్తూ వీడియో షేర్ చేశారు..
ప్రభుదేవా డ్యాన్స్ గురించి కొత్తగా చెప్పక్కర్లేదు.. ఈ పాటకు సింపుల్ అండ్ కూల్‌గా తన స్టైల్లో స్టెప్పులేసి అలరించారు.. తన ట్విట్టర్ అకౌంట్‌లో ఈ వీడియో షేర్ చేయగా వైరల్ అవుతోంది.. ‘‘మీరు సూపర్ మాస్టర్.. ట్రిపులార్ టీమ్‌కిది బెస్ట్ ట్రిబ్యూట్’’ అంటూ ఫ్యాన్స్ అండ్ ఆడియన్స్ కామెంట్స్ చేస్తున్నారు.. ఇటీవలే జూనియర్ ఎన్టీఆర్, రాజమౌళి, రామ్ చరణ్ ఇండియా తిరిగొచ్చిన సంగతి తెలిసిందే..