మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలలో అధ్యక్ష పదవికి పోటీ చేసి ప్రకాష్ రాజ్ ఓడిపోయిన సంగతి తెలిసిందే. అయితే ఒక ఇంటర్వ్యూలో ప్రకాష్ రాజ్ టాలీవుడ్ హీరోల గురించి మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు. తన పేరు ప్రకాష్ రాయ్ అని దర్శకుడు బాలచందర్ తన పేరును ప్రకాష్ రాజ్ గా మార్చారని ప్రకాష్ రాజ్ చెప్పుకొచ్చారు. బాలచందర్ డైరెక్షన్ లో తెరకెక్కిన డ్యూయెట్ సినిమాతో నటుడిగా కెరీర్ మొదలైందని ప్రకాష్ రాజ్ అన్నారు.
తన తమ్ముడు హైదరాబాద్ లో స్థిరపడ్డాడని చెల్లెలు ఆస్ట్రేలియాలో స్థిరపడిందని ప్రకాష్ రాజ్ చెప్పుకొచ్చారు. భాష మాట్లాడకపోతే అభినయం కనిపించదని తాను ఏడు భాషలలో అనర్గళంగా మాట్లాడగలనని ప్రకాష్ రాజ్ వెల్లడించారు హాలీవుడ్ లోకి కూడా ఎంట్రీ ఇస్తున్నానని అక్కడ రెండు ప్రాజెక్ట్ లు చేయాల్సి ఉందని ప్రకాష్ రాజ్ పేర్కొన్నారు. తనకు మొత్తం ఐదు జాతీయ అవార్డులు వచ్చాయని నటనకు నాలుగు అవార్డులు రాగా నిర్మాతగా ఒక అవార్డ్ వచ్చిందని ప్రకాష్ రాజ్ తెలిపారు.
తెలుగులో సంకల్పం తన తొలి సినిమా అని ప్రకాష్ రాజ్ చెప్పుకొచ్చారు. నిర్మాతగా 26 సినిమాలను నిర్మించానని తాను పరిమిత బడ్జెట్ లో మాత్రమే సినిమాలను నిర్మించానని ప్రకాష్ రాజ్ చెప్పుకొచ్చారు. ఎస్వీ రంగారావు తనకు బాగా నచ్చిన నటుడని ఈ జనరేషన్ లో మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ నటన తనకు చాలా ఇష్టమని ప్రకాష్ రాజ్ పేర్కొన్నారు. బన్నీ నటుడిగా ఎదిగిన తీరును చూస్తే తనకు ముచ్చటేస్తోందని ప్రకాష్ రాజ్ చెప్పుకొచ్చారు.