“దేవర” (Devara) రేపు రాత్రి నుండి థియేటర్లలో హల్ చల్ చేయనుంది. ఎన్టీఆర్ (Jr NTR) అభిమానుల రెండున్నరేళ్ల ఆకలి రేపటితో తీరనుంది. అయితే.. “దేవర” తెలుగు రాష్ట్రాల హక్కులను కొనుగోలు చేసిన నాగవంశీ ఎన్టీఆర్ అభిమానులకు ట్విట్టర్ ద్వారా ఓ లేఖ రాశాడు. ఆరేళ్ల తర్వాత ఎన్టీఆర్ సోలో సినిమా రిలీజ్ అవుతోంది. ఆయన తన బెస్ట్ ఇచ్చాడు, సినిమాను ఎక్కువ థియేటర్లలో రిలీజ్ చేయడంలో మేము మా బెస్ట్ చేసాం.
Naga Vamsi
అభిమానులు కూడా ఫ్యాన్ వార్స్ కు స్వస్తి పలకాలనీ, ఆ ఫ్యాన్ వార్స్ వల్ల సినిమాకి నెగిటివిటీ పెరిగిపోయి నష్టం వాటిల్లుతోందని వంశీ (Suryadevara Naga Vamsi) పేర్కొన్నాడు. అదే సందర్భంలో దయచేసి ఫ్యాన్స్ ఫస్ట్ షో చూస్తున్నప్పుడు సినిమాలోని కీలకమైన సన్నివేశాలను రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయొద్దని, ఒకవేళ మీ పక్కన ఎవరైనా ముబైల్లో షూట్ చేస్తున్నా కూడా అడ్డుకోవాలని పిలుపునిచ్చాడు.
మరి నాగవంశీ హితబోధను నిజంగానే ఫ్యాన్ వార్స్ ఆపకపోయినా కనీసం కీలకమైన సీన్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయకుండా ఉంటే చాలు. ఎందుకంటే.. “కల్కి” (Kalki 2898 AD) సినిమా విడుదలైనప్పుడు దుల్కర్ & విజయ్ దేవరకొండల క్యారెక్టర్లు ఓవర్సీస్ షో టైమ్ కే లీక్ అయిపోవడంతో తర్వాత సినిమా చూసే వాళ్లకి పెద్ద ఎగ్జైట్మెంట్ లేకుండాపోయింది. “దేవర” విషయంలో అలా జరగకుండా ఉంటే బాగుంటుంది.
ఎందుకంటే.. “దేవర” బృందం సినిమాలోని చాలా కీలక అంశాలను, ట్విస్టులను ఇప్పటివరకు లీక్ అవ్వకుండా చాలా జాగ్రత్తపడ్డారు. అలాంటిది ఒక్క వీడియోతో అవన్నీ లీక్ అవ్వడం థియేటరికల్ ఎక్స్ పీరియన్స్ ను పాడు చేస్తుంది. సో, ఈ విషయంలోనైనా అభిమానులు సహకరిస్తారేమో చూడాలి. ఇకపోతే.. “దేవర” బెనిఫిట్ షోస్ కి తెలంగాణాలో భీభత్సమైన క్రేజ్ ఏర్పడింది. అర్ధరాత్రి 1.00 షోస్ టికెట్స్ ఏకంగా 2000/- రూపాయలకు అఫీషియల్ గానే అమ్ముతున్నారు.