విశ్వక్ సేన్ (Vishwak Sen) చేస్తున్న వరుస సినిమాల్లో ‘లైలా’ (Laila) అనే సినిమా ఒకటి. రామ్ నారాయణ్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాని ‘షైన్ స్క్రీన్స్’ బ్యానర్ సాహు గారపాటి (Sahu Garapati) నిర్మిస్తున్నారు. ఫిబ్రవరి 14న ఈ సినిమా రిలీజ్ కాబోతోంది. ఆల్రెడీ ప్రమోషన్స్ స్టార్ట్ అయ్యాయి. ఇందులో భాగంగా ఫస్ట్ సింగల్ గా ‘సోను మోడల్’ అనే లిరికల్ సాంగ్ ను విడుదల చేశారు. అలాగే టీజర్ ను కూడా విడుదల చేశారు. సోను అనే లేడీ బ్యూటీ పార్లర్ నడిపే అబ్బాయిగా విశ్వక్ సేన్ ఈ సినిమాలో కనిపించబోతున్నాడు.
Sahu Garapati
అలాగే కొన్ని కారణాల వల్ల అతను లేడీ గెటప్ కూడా వేయాల్సి వస్తుంది. అది ఎందుకు? అనే ఎలిమెంట్ చుట్టూనే ఈ సినిమా ప్రమోషన్స్ చేస్తున్నారు మేకర్స్. తాజాగా సెకండ్ లిరికల్ సాంగ్ ‘ఇచ్చుకుందాం బేబీ’ అనే పాటను కూడా విడుదల చేశారు. ఇక ఈ సాంగ్ లాంచ్ వేడుకలో భాగంగా నిర్మాత విశ్వక్ సేన్ మాట్లాడుతూ ఓ షాకింగ్ విషయాన్ని బయటపెట్టాడు. అదేంటంటే.. ‘లైలా’ సినిమాని ముగ్గురు హీరోలు రిజెక్ట్ చేశారట.
అందుకు కారణం.. ఈ సినిమాలో హీరో లేడీ గెటప్ వేయడమే అని క్లారిటీ ఇచ్చాడు. అయితే విశ్వక్ సేన్ కి ఈ కథ చెప్పినప్పుడు.. ముందుగా ఆ పాత్ర గురించే చెప్పారట. అతను ఎక్సైట్ అయ్యి ‘ఇలాంటి పాత్ర కోసమే ఎదురుచూస్తున్నాను’ అని చెప్పి వెంటనే ‘లైలా’ సినిమాని ఓకే చేశాడట. ప్రస్తుతం నిర్మాత కామెంట్స్ వైరల్ గా మారాయి :
Three heroes rejected #Laila as they didn’t dare to do a lady’s getup. Only #Vishwaksen came forward.