ప్రశాంత్ వర్మ (Prasanth Varma) దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ (Balakrishna) కుమారుడు.. మోక్షజ్ఞ (Nandamuri Mokshagnya) హీరోగా ఎంట్రీ ఇవ్వాల్సి ఉంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చింది. ‘ఎస్.ఎల్.వి. సినిమాస్’ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి (Sudhakar Cherukuri) ఈ చిత్రాన్ని నిర్మించాల్సి ఉంది. బాలయ్య చిన్న కూతురు తేజస్విని కూడా దీనికి సమర్పకురాలిగా వ్యవహరిస్తున్నట్లు కూడా ప్రకటించారు. ఈపాటికే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళాలి. కానీ ఎందుకో ఆలస్యమైంది. ఈ గ్యాప్లో ఈ ప్రాజెక్టు గురించి చాలా గాసిప్పులు వినిపించాయి.
Mokshagnya
‘ఈ ప్రాజెక్టు ఆగిపోయిందని, దర్శకుడు ప్రశాంత్ వర్మకి .. మోక్షజ్ఞకి క్రియేటివ్ డిఫరెన్సెస్ వచ్చాయని, ప్రశాంత్ వర్మ వైఖరి కూడా మోక్షజ్ఞకి నచ్చట్లేదు అని’ ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత నిర్మాతలు కూడా దీనిపై స్పందించలేదు కాబట్టి.. ఇది నిజమే అని అంతా అనుకున్నారు. ఓ రకంగా క్రియేటివ్ డిఫరెన్సెస్ అనేది నిజమే అని టాక్ గట్టిగానే వినిపిస్తోంది. కాకపోతే మోక్షజ్ఞకి ప్రశాంత్ వర్మకి కాదు, ప్రశాంత్ వర్మకి తేజస్వినికి అని తెలుస్తుంది.
అయితే బాలయ్య ఇన్వాల్వ్ అయ్యి ఆ ఇష్యూని సాల్వ్ చేయడం కూడా జరిగిందట. అందుకే ఇప్పుడు నిర్మాతలు ఈ ప్రాజెక్టు ఆగిపోయింది అంటూ వస్తున్న వార్తలను నమ్మొద్దు అంటూ ఓ ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. వాస్తవానికి మొదటి గాసిప్పు వచ్చినప్పుడే వాళ్ళు స్పందించాలి. కానీ అప్పుడు స్పందించలేదు. తర్వాత మరిన్ని గాసిప్పులు వినిపించాయి. అప్పుడు కూడా స్పందించలేదు. ఇప్పుడు ఈ ప్రాజెక్టు గురించి అంతా మర్చిపోతున్న టైంలో..’అదంతా అసత్య ప్రచారం’ అంటూ క్లారిటీ ఇచ్చి ఏం లాభం.