‘పుష్ప 2’ (Pushpa 2 The Rule) ఫస్ట్ వీకెండ్ అదీ లాంగ్ వీకెండ్ ను చాలా బాగా క్యాష్ చేసుకుంది. అల్లు అర్జున్ (Allu Arjun) నటన, సుకుమార్ (Sukumar) టేకింగ్.. వంటి వాటికి ఆడియన్స్ ఫిదా అయిపోయారు. ‘మైత్రి మూవీ మేకర్స్’ సంస్థ ఈ సినిమాను ప్రమోట్ చేసిన తీరు కూడా అందరినీ ఆకట్టుకుంది. మొదటి రోజు ఆల్ టైం రికార్డులు సృష్టించిన ఈ సినిమా.. రెండో రోజు, మూడో కొంచెం డౌన్ అయినట్టు కనిపించినా.. ఆదివారం నాడు ఆల్మోస్ట్ మొదటి రోజుతో ఈక్వల్ గా కలెక్ట్ చేసింది.
Pushpa 2 The Rule Collections
కొన్ని ఏరియాల్లో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కి దగ్గర పడింది. కొన్ని ఏరియాల్లో ఆశించిన స్థాయిలో కలెక్ట్ చేయలేదు. ఒకసారి ‘పుష్ప 2’ ఫస్ట్ వీకెండ్ (Pushpa 2 The Rule) కలెక్షన్స్ ని గమనిస్తే :
‘పుష్ప 2’ చిత్రానికి రూ.600 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.605 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది. 4 రోజులు అంటే మొదటి వీకెండ్ ముగిసేసరికి ఈ సినిమా రూ.348.22 కోట్ల షేర్ ను రాబట్టి ఆల్ టైం రికార్డులు సృష్టించింది. బ్రేక్ ఈవెన్ కోసం మరో రూ.256.78 కోట్ల షేర్ రావాలి. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా ఆశించిన స్థాయిలో కలెక్ట్ చేయడం లేదు. గుంటూరు, కృష్ణా, సీడెడ్ బాగానే ఉన్నా మిగిలిన ఏరియాల్లో ఆశించిన స్థాయిలో టికెట్లు తెగడం లేదు. కేరళలో కూడా ఈ సినిమా పెర్ఫార్మన్స్ చాలా వీక్ గా ఉంది. మరి వీక్ డేస్ లో ఎలా నిలబడుతుందో చూడాలి.