డిసెంబర్ 5న ‘పుష్ప 2’ (Pushpa 2) విడుదల కాబోతుంది. డిసెంబర్ 4 నుండే ప్రీమియర్స్ కూడా వేస్తున్నారు. సో అలా చూసుకుంటే రిలీజ్ డేట్ కి కరెక్ట్ గా వారం రోజులే టైం ఉన్నట్టు. అంటే డిసెంబర్ 3 కి ఫైనల్ కాపీలు పంపాల్సిన బాధ్యత సుకుమార్ పై ఉంది. సరే ఇంతకీ షూటింగ్ కంప్లీట్ అయ్యిందా అంటే.. ప్యాచ్ వర్క్ జరుగుతూనే ఉంది అని ఇన్సైడ్ టాక్. నిన్న రామోజీ ఫిల్మ్ సిటీలో అర్ధరాత్రి వరకు ప్యాచ్ వర్క్ చేశారు.
Pushpa 2 The Rule
నిన్నటితో షూటింగ్ పార్ట్ కంప్లీట్ అయిపోయినట్టే అని అంతా అనుకుంటున్నారు. కానీ సుకుమార్ ఇంకో రెండు సీన్లకి మళ్ళీ ప్యాచ్ వర్క్ చేయాలని భావిస్తున్నాడట.సో ఈరోజు, రేపు కూడా ఆ పనులు జరుగుతాయనుకోవాలి. మరోపక్క నవంబర్ 20 కి సుకుమార్ (Sukumar) ఫస్ట్ కాపీ ఇవ్వాల్సింది.. కానీ అది డిలే అయ్యింది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పనులు పూర్తయిపోయినట్టే..! సంగీత దర్శకుడు దేవి (Devi Sri Prasad) ఒక వెర్షన్ ఇచ్చాడు.
తమన్ (S.S.Thaman) , సామ్ సి ఎస్ (Sam C. S.) , అజనీష్ లోకనాథ్(B. Ajaneesh Loknath).. లు ఇంకో వెర్షన్ కి పనిచేశారు. ఫైనల్ గా ఎవరి వెర్షన్ బయటకు వస్తుంది అనేది ప్రస్తుతానికి సస్పెన్స్ గా మారింది. ఇక మరోపక్క ‘పుష్ప 2’ రన్ టైం 3 గంటలు దాటేసింది అనే టాక్ నడుస్తుంది. అందుతున్న సమాచారం ప్రకారం.. ‘పుష్ప 2’ రన్ టైం 3 గంటల 15 నిమిషాల పాటు వచ్చిందట.
అంటే దాదాపు ‘యానిమల్’ (Animal) రన్ టైం అనే చెప్పాలి. మల్టీప్లెక్సుల్లో ఆడియన్స్ మూడున్నర గంటల పాటు కూర్చోవాల్సిందే. సుకుమార్ 3 ఏళ్ళు కష్టపడి తీశాడు. కాబట్టి.. తాను రాసిన ప్రతి సీన్.. స్క్రీన్ పై ఉండాలని భావిస్తాడు. అలా అని ఆడియన్స్ 3 గంటలు పైగా కూర్చోగలరా?