పాన్ ఇండియా లెవెల్‌లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ‘పుష్ప 2’ (Pushpa 2) పై రోజుకో కొత్త రూమర్ వినిపిస్తోంది. స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) , సుకుమార్ (Sukumar) కాంబినేషన్ తో వచ్చిన మొదటి భాగం ఘనవిజయం సాధించడంతో, ఈ సీక్వెల్‌పై అంచనాలు మరింతగా పెరిగాయి. డిసెంబర్ 5న విడుదలకు సిద్దమవుతున్న ఈ సినిమా, ఆడియన్స్‌ను థియేటర్ల వైపు రప్పించేందుకు భారీ ప్రమోషన్స్‌తో దూసుకుపోతోంది. ఇప్పటికే ట్రైలర్‌కు అద్భుతమైన స్పందన రాగా, మేకర్స్ కూడా ప్రతి అప్డేట్‌ను స్ట్రాటజీతో ప్లాన్ చేస్తున్నారు.
Pushpa 2
అయితే టికెట్ రేట్లు పెరుగుతాయన్న వార్తలు సోషల్ మీడియాలో చర్చనీయాంశమయ్యాయి. పుష్ప 2 కోసం మల్టీప్లెక్స్‌లలోనే కాకుండా సింగిల్ స్క్రీన్‌లలో కూడా టికెట్ ధరలు భారీగా పెరుగుతాయని ప్రచారం జరుగుతోంది. ఈ రూమర్లపై మేకర్స్ క్లారిటీ ఇచ్చినట్లు సమాచారం. పుష్ప 2 టికెట్ ధరలు గతంలో వచ్చిన పెద్ద సినిమాల రేంజ్‌లోనే ఉంటాయని స్పష్టం చేశారు. అంటే, మల్టీప్లెక్స్‌లో స్టాండర్డ్ రేట్లు, సింగిల్ స్క్రీన్‌లలో అందుబాటు ధరలే ఉంటాయని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.
టికెట్ రేట్లు తక్కువగా ఉంటేనే సినిమాను పెద్ద మొత్తంలో ప్రేక్షకులు చూసే అవకాశం ఉంటుందని, అందుకే ప్రత్యేక ప్రణాళికతో ముందుకు వెళ్తున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి పుష్ప 1 (Pushpa) సమయంలో ఏపీ టికెట్ ధరల విషయంలో కొంత సమస్య తలెత్తిన సంగతి తెలిసిందే. ఈసారి మేకర్స్ ఆ అనుభవం దృష్టిలో పెట్టుకుని ప్రేక్షకులకు అందుబాటులో ఉండేలా ప్లాన్ చేస్తున్నారని సమాచారం.
యూఎస్ మార్కెట్‌తోపాటు దేశవ్యాప్తంగా సాలిడ్ ఓపెనింగ్స్ అందుకునేలా పుష్ప 2 టికెట్ స్ట్రాటజీ ఉంటుందట. ఇకపోతే సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ ముమ్మరంగా జరుగుతున్నాయి. రష్మిక మందన్న (Rashmika Mandanna), ఫహద్ ఫాజిల్ (Fahadh Faasil) కీలక పాత్రల్లో కనిపించబోతుండగా, అల్లు అర్జున్ పుష్పరాజ్‌గా మరోసారి ప్రేక్షకుల మన్ననలు అందుకోవడం ఖాయమని అభిమానులు భావిస్తున్నారు. ట్రేడ్ వర్గాల అంచనాల ప్రకారం, పుష్ప 2 ఫస్ట్ డే 200 కోట్ల గ్రాస్ వసూలు చేసే చాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.