Pushpa Movie: ఆ జాబితాలో తొలి స్థానం పుష్ప మూవీదే!

సుకుమార్ డైరెక్షన్ లో బన్నీ హీరోగా తెరకెక్కిన పుష్ప ది రైజ్ 10 రోజుల క్రితం థియేటర్లలో విడుదలై రికార్డు స్థాయిలో కలెక్షన్లను సాధిస్తోంది. ఫుల్ రన్ లో ఈ సినిమా ఏపీ మినహా మిగిలిన ఏరియాల్లో భారీగా లాభాలను అందించడం ఖాయమనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ ఏడాది విడుదలైన సినిమాలలో బిగ్గెస్ట్ హిట్ గా పుష్ప సినిమా నిలిచింది. పుష్ప సినిమా 100 కోట్ల రూపాయలకు పైగా షేర్ కలెక్షన్లను సాధించింది.

దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు నమోదు కావడంతో పాటు ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నా పుష్ప హవా మాత్రం కొనసాగుతోంది. బాలీవుడ్, కోలీవుడ్, మల్లూవుడ్ లలో బన్నీ సత్తా చాటుతున్నారు. ఈ ఏడాది బుక్ మై షోలో తెలుగులో ఎక్కువ టికెట్లు బుక్ అయిన సినిమాల జాబితాలో పుష్ప టాప్1 సినిమాగా నిలిచింది. అల వైకుంఠపురములో సినిమా తర్వాత మరో భారీ సక్సెస్ ను పుష్ప సినిమాతో బన్నీ ఖాతాలో వేసుకున్నారు.

ఈ జాబితాలో రెండో స్థానంలో పవన్ నటించిన వకీల్ సాబ్ మూవీ ఉంది. పింక్ కు రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమా తెలుగులో 85 కోట్ల రూపాయలకు పైగా షేర్ కలెక్షన్లను సాధించింది. ఈ జాబితాలో మూడో స్థానంలో అఖండ నిలిచింది. ఫుల్ రన్ లో ఈ సినిమాకు 68 కోట్ల రూపాయలకు పైగా షేర్ కలెక్షన్లు వచ్చాయి. నవీన్ పోలిశెట్టి హీరోగా తెరకెక్కిన జాతిరత్నాలు సినిమా ఈ జాబితాలో నాలుగో స్థానంలో ఉంది.

మెగా హీరో వైష్ణవ్ తేజ్ నటించిన ఉప్పెన బుక్ మై షోలో ఎక్కువ టికెట్లు బుకింగ్ అయిన ఐదో సినిమాగా ఈ సినిమా నిలిచింది. ఈ ఏడాది పెద్ద హీరోల సినిమాలు ఎక్కువగా విడుదల కాకపోవడంతో యంగ్ హీరోలకు టాప్ 5 జాబితాలో చోటు దక్కింది. వకీల్ సాబ్ పై పుష్ప ది రైజ్ పై చేయి సాధించడం గమనార్హం. తెలుగు సినిమాలతో పాటు డబ్బింగ్ సినిమాలకు సైతం తెలుగు రాష్ట్రాల్లో భారీ స్థాయిలోనే టికెట్లు బుకింగ్ కావడం గమనార్హం.

శ్యామ్ సింగరాయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

83 సినిమా రివ్యూ & రేటింగ్!
వామ్మో.. తమన్నా ఇన్ని సినిమాల్ని మిస్ చేసుకుండా..!
‘అంతం’ టు ‘సైరా’.. నిరాశపరిచిన బైలింగ్యువల్ సినిమాల లిస్ట్..!

Share.