ఇండస్ట్రీకి వచ్చిన పదేళ్లు పూర్తి చేసుకొన్న కాజల్, త్రిష, నయనతార వంటి సీనియర్ స్టార్ హీరోయిన్లందరూ వరుస అవకాశాలొస్తున్నప్పటికీ.. తెలుగు భాష మీద కానీ.. తెలుగు చలనచిత్రసీమ మీద కానీ ఏమాత్రం గౌరవం చూపకుండా ఇప్పటికీ కనీసం తెలుగులో మాట్లాడడం మాత్రమే కాక అర్ధం చేసుకోడానికి కూడా ప్రయత్నించకుండా కేవలం స్టార్ డమ్ తో నెట్టుకొచ్చేస్తుండగా.. సరికొత్త హీరోయిన్లు రకుల్ ప్రీత్ సింగ్, రాశీఖన్నా, నివేదా థామస్, సాయిపల్లవి వంటి ముద్దుగుమ్మలు మాత్రం తెలుగులో డిగ్రీ పూర్తి చేసి.. త్వరలో పీహెచ్డీ చేసేందుకు కూడా సన్నద్ధమవుతున్నారు.
ఆల్రెడీ “వరల్డ్ ఫేమస్ లవర్” చిత్రానికి స్వంత డబ్బింగ్ చెప్పుకొన్న రాశీఖన్నా.. ఇక నుంచి తాను నటించే సినిమాలకు కుదిరినప్పుడల్లా తానే డబ్బింగ్ చెబుతానంటోంది. “వెంకీ మామ”లో డబ్బింగ్ చెప్పే ఆస్కారం లేదని.. ఇక నుంచి తాను నటించే సినిమాలకు తానే డబ్బింగ్ చెప్పుకొంటానని అంటోంది రాశీఖన్నా. వరుస అవకాశాలతో ఫుల్ ఫామ్ లో ఉన్న రాశీఖన్నాకు ఓన్ డబ్బింగ్ అనేది మరో ప్లస్ పాయింట్ అవుతుంది.