‘ఆర్.ఆర్.ఆర్’ ఎలాగూ పోస్ట్ పోన్ అయ్యింది. ‘రాధే శ్యామ్’ సంగతేంటి? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారిపోయింది. ఓ పక్క జనవరి 14నే ‘రాధే శ్యామ్’ విడుదల కాబోతుంది అని చిత్ర బృందం తెలుపుతున్నప్పటికీ..జనాల్లో కొంచెం కూడా నమ్మకం లేదు. ఇటీవల కాలంలో పోస్ట్ పోన్ అయిన ‘భీమ్లా నాయక్’ ‘ఆర్.ఆర్.ఆర్’ సినిమాల విషయంలో కూడా నిర్మాతలు ఇలాగే చెప్పుకొచ్చారు. కానీ చివరికి అనుకున్నదే అయ్యింది. అందుకే ‘రాధే శ్యామ్’ రిలీజ్ విషయంలో ఉత్కంఠత నెలకొంది.
కానీ ఈ సినిమా రిలీజ్ చేయడానికి చాలా అడ్డంకులు ఉన్నాయి. ‘రాధే శ్యామ్’ కి రూ.280 కోట్ల వరకు బడ్జెట్ పెట్టారు. అయితే ఊహించని విధంగా ‘రాధే శ్యామ్’ నిర్మాతలకి రూ.350 కోట్ల భారీ డీల్ వెతుక్కుంటూ వచ్చింది. అదీ తెలుగు వెర్షన్ కాకుండా హిందీ, శాటిలైట్, డబ్బింగ్ రైట్స్ తో కలుపుకుని..! దాంతో బాలీవుడ్లో సల్మాన్ ‘రాధే’ కి ఫాలో అయిన టెక్నిక్ నే ‘రాధే శ్యామ్’ కి అప్లై చేయాలని చిత్ర బృందం భావిస్తోందట.
తెలుగులో మాత్రం ‘రాధే శ్యామ్’ ను థియేటర్లలో దింపాలని నిర్మాతలు భావిస్తున్నట్టు సమాచారం.అలా అయితే నిర్మాతలకి పెద్దగా లాస్ ఉండకపోవచ్చు. పైగా సంక్రాంతికి పెద్ద సినిమాలు ఏమీ లేవు కాబట్టి.. ఇది సేఫ్ గేమ్ అని కూడా నిర్మాతలు భావిస్తున్నారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో జరుగుతున్న టాక్ ఇది. మరో రెండు రోజుల్లో ‘రాధే శ్యామ్’ రిలీజ్ పై ఓ క్లారిటీ వస్తుంది.