కోలీవుడ్ ఇండస్ట్రీలో నటుడిగా, కొరియోగ్రాఫర్ గా మంచి గుర్తింపు కలిగి ఉన్న రాఘవ లారెన్స్ కు ఇతర భాషల్లో సైతం మంచి పేరు ఉంది. దివ్యాంగులు, అనాథ బాలల కోసం సహాయం చేసే విషయంలో ఆయన ముందువరసలో ఉంటారు. తాజాగా దివ్యాంగులకు మేలు చేసేలా రాఘవ లారెన్స్ (Raghava Lawrence) తీసుకున్న నిర్ణయాన్ని నెటిజన్లు మెచ్చుకుంటున్నారు. దివ్యాంగుల కోసం బైక్స్ కొనుగోలు చేసిన రాఘవ లారెన్స్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దివ్యాంగులైన వీరందరూ మల్లరకంభంలో అద్భుతమైన ప్రతిభ కనబరిచారని లారెన్స్ పేర్కొన్నారు.
చేసే పని విషయంలో వారికి ఉన్న పట్టుదలను చూసి నేను చాలా సంతోషిస్తున్నానని రాఘవ లారెన్స్ చెప్పుకొచ్చారు. వాళ్లందరికీ బైక్స్ ఇవ్వడంతో పాటు ఇళ్లు కట్టిస్తానని మాట ఇచ్చానని ఆయన వెల్లడించారు. అందులో భాగంగా 13 బైక్స్ కొనుగోలు చేశానని రాఘవ లారెన్స్ పేర్కొన్నారు. వాళ్లకు ఉపయోగపడేలా ఆ బైక్స్ ను త్రీ వీలర్స్ గా మార్పించనున్నామని రాఘవ లారెన్స్ అన్నారు. ఇచ్చిన మాట ప్రకారం త్వరలో ఇళ్లు కూడా నిర్మిస్తానని లారెన్స్ చెప్పుకొచ్చారు.
లారెన్స్ చెప్పిన విషయాలు నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ప్రస్తుతం లారెన్స్ దుర్గ అనే ప్రాజెక్ట్ కోసం వర్క్ చేస్తున్నారు. ఈ సినిమాతో కూడా లారెన్స్ సక్సెస్ అందుకోవాలని నెటిజన్లు చెబుతున్నారు. రాఘవ లారెన్స్ ను ఎంత మెచ్చుకున్నా తక్కువేనని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. సెలబ్రిటీలు సంపాదించిన డబ్బులో కనీసం 5 శాతం కష్టాల్లో ఉన్నవారి కోసం ఖర్చు చేసినా ఎంతోమందికి ప్రయోజనం కలుగుతుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
రాఘవ లారెన్స్ తన సంపాదనలో ఎక్కువ మొత్తాన్ని సేవా కార్యక్రమాల కోసం ఖర్చు చేస్తూ ఎంతోమంది జీవితాల్లో వెలుగు నింపుతున్నారు. లారెన్స్ మనుషులలో దేవుడని కొంతమంది అభిమానులు అభిప్రాయపడుతున్నారు. హర్రర్ కామెడీ బ్యాక్ డ్రాప్ సినిమాలలో లారెన్స్ ఎక్కువగా నటిస్తుండటం గమనార్హం.