టాలీవుడ్ ఇండస్ట్రీలో నటుడిగా, దర్శకుడిగా, కొరియోగ్రాఫర్ గా రాఘవ లారెన్స్ (Raghava Lawrence) మంచి పేరును సంపాదించుకున్నారనే సంగతి తెలిసిందే. రాఘవ లారెన్స్ వివాదాలకు దూరంగా ఉంటూ అభిమానులకు అంతకంతకూ దగ్గరవుతున్నారు. మురుగమ్మాళ్ అనే మహిళకు లారెన్స్ ఆటోను కొని ఇవ్వడం ప్రస్తుతం నెట్టింట హాట్ టాపిక్ అవుతోంది. మురుగమ్మాళ్ రైలులో సమోసాలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఊహించని స్థాయిలో ఫ్యాన్ బేస్ ను కలిగి ఉన్న లారెన్స్ కష్టాల్లో ఉన్న మరో మహిళకు అండగా నిలబడటంపై నెటిజన్ల నుంచి ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.
లారెన్స్, కోలీవుడ్ కమెడియన్ కేవైపీ బాల కష్టాల్లో ఉన్న ఆటో మహిళను ఆదుకుని వార్తల్లోకెక్కారు. మురుగమ్మాళ్ భర్తను కోల్పోయి ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. లారెన్స్ ఆటో కొని ఇచ్చిన వెంటనే ఆమె ఎంతగానో ఎమోషనల్ అయ్యారు. మహిళ ఎమోషనల్ అయిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుండగా లారెన్స్ రియల్ హీరో అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కష్టాల్లో ఉన్నవాళ్లకు సహాయం చేయాలంటే మంచి మనస్సు కావాలని అలాంటి మంచి మనస్సు కొందరికే ఉంటుందని నెటిజన్లు చెబుతున్నారు.
లారెన్స్ తన సహాయ కార్యక్రమాల ద్వారా ఎంతోమందికి ఇన్స్పిరేషన్ గా నిలుస్తున్నారని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. లారెన్స్ వేగంగా సినిమాలలో నటించాలని అభిమానులు కోరుకుంటుండగా లారెన్స్ కొత్త ప్రాజెక్ట్ ల గురించి క్లారిటీ రావాల్సి ఉంది. రాఘవ లారెన్స్ మల్టీ టాలెంటెడ్ కాగా తన సంపాదనలో ఎక్కువ మొత్తాన్ని ఆయన ఇతరుల కోసం ఖర్చు చేస్తుండటం గమనార్హం.
రాఘవ లారెన్స్ ఇన్ స్టాగ్రామ్ వేదికగా మహిళకు ఆటో ఇచ్చిన వీడియోను పంచుకోగా ఆ వీడియోకు 19 వేలకు పైగా లైక్స్ వచ్చాయి. రాఘవ లారెన్స్ భాష, కులం, మతంతో సంబంధం లేకుండా సహాయం చేస్తున్నారు. తన దృష్టికి వచ్చిన ప్రతి సమస్యను ఆయన పరిష్కరిస్తున్నారు.