Raja Raja Chora Movie: ఓటీటీ ప్రేక్షకుల మనసు దోచేస్తున్న రాజ రాజ చోర!

టాలీవుడ్ యంగ్ హీరోలలో వైవిధ్యం ఉన్న కథలను ఎంచుకునే హీరోగా శ్రీవిష్ణుకు పేరుంది. డిఫరెంట్ మూవీస్ తో సినిమాసినిమాకు క్రేజ్ పెంచుకుంటున్న శ్రీవిష్ణు నటించిన రాజ రాజ చోర సినిమా ఈ నెల 8వ తేదీ నుంచి జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న సంగతి తెలిసిందే. దసరా పండుగకు ఓటీటీలో మంచి సినిమా చూడాలని అనుకునే వాళ్లకు రాజ రాజ చోర మూవీ బెస్ట్ ఆప్షన్ అవుతుంది. కథ, కథనంలో చిన్నచిన్న లోపాలు ఉన్నా ఈ చోరుడు ప్రేక్షకుల మనస్సును గెలుచుకుంటాడు.

బ్యాగ్రౌండ్ లేకుండా హీరోగా నిలదొక్కుకున్న శ్రీవిష్ణు తన సినిమాలలో కొత్తదనం ఉంటుందని ప్రేక్షకులకు భరోసా ఇస్తున్నారు. హాస్యంతో పాటు ఎమోషన్లకు ప్రాధాన్యత ఉన్న ఈ సినిమా ఒకసారి చూడటానికి ఢోకా లేని ఎంటర్టైన్మెంట్ మూవీ అని చెప్పవచ్చు. కొత్త దర్శకుడు హసిత్ గోళీ సరదా సన్నివేశాలతో అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే విధంగా కథ, కథనంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవడం గమనార్హం. హసిత్ గోళీ రచనలో ప్రత్యేకమైన ముద్ర వేశారు.

శ్రీవిష్ణు కెరీర్ బెస్ట్ పర్ఫామెన్స్ ఇచ్చిన రాజ రాజ చోర ఓటీటీలో భారీగా వ్యూస్ ను సొంతం చేసుకుంటోంది. ఈ సినిమాకు వివేక్ సాగర్ అందించిన పాటలు, బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ప్రాణం పోశాయి. గంగవ్వ పాత్ర సినిమాకే హైలెట్ గా నిలిచింది. ఎంటర్టైన్మెంట్ సినిమాలను ఇష్టపడే వ్యక్తులకు ఈ సినిమా ఎంతగానో నచ్చుతుందని చెప్పవచ్చు. మేఘా ఆకాష్, సునైనా సినిమాలో అందంగా కనిపించడంతో పాటు అభినయంతో మెప్పించారు.

కొండ పొలం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సమంత- నాగచైతన్య మాత్రమే కాదు టాలీవుడ్లో ఇంకా చాలా మంది ఉన్నారు..!
‘రిపబ్లిక్’ మూవీలో గూజ్ బంప్స్ తెప్పించే డైలాగులు ఇవే..!
టాలీవుడ్ స్టార్ హీరోల ఇష్టమైన కార్లు..వాటి ధరలు

Share.