నేను హారర్ సినిమాలను ఎక్కువగా తీయను.హారర్ సినిమాలు చూడను కూడా. నేను వాటికి చాలా దూరంగా ఉంటాను . నేను చూసిన హారర్ సినిమాలు చాలా తక్కువ. అందులో నాకు నచ్చినవి రెండే రెండు. అందులో ఒకటి ‘ ది ఒమెన్ ‘, ‘ పారనార్మల్ యాక్టివిటీ ‘. సాధారణంగా హారర్ సినిమాలు రెండు రకాలు ఉంటాయి. ఒకటి వెనుక ఏదో ఉన్నట్టు ఒక ఐడియా తో భయపడుతూ ఉండడం… అది ఒక రకం.
ఇక రెండోది వెనుక ఏదో తిరుగుతున్నట్టు చూపించడం. నాకు ఐడియాతో భయపెట్టే హారర్ సినిమాలు అంటే ఇష్టం అంటే మొదటి రకం.అన్య టుటోరియల్ టీజర్, ట్రైలర్ చూస్తుంటే నాకు నచ్చిన మొదటి రకం అనిపిస్తుంది. జూలై 1 నుండీ ఆహా లో స్ట్రీమింగ్ అవుతుంది.. తప్పకుండా చూడండి అంటూ అన్య టుటోరియల్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో రాజమౌళి చెప్పుకొచ్చారు. అలాగే తనకి హారర్ సినిమాలు చూడాలి అనిపిస్తే తన భార్య రమని పక్కన పెట్టుకుని చూస్తానని చెప్పారు.
ఆమెకు భయం ఉండదు అని కూడా చెప్పారు. ఇదే క్రమంలో తాను భవిష్యత్తు లో హారర్ సినిమాల జోలికి పోకూడదు అని కూడా అనుకుంటున్నట్టు తెలిపారు. ఒకవేళ రైటింగ్ బాగా నచ్చితే.. హారర్ అనేది భయపెట్టడం, దెయ్యాలు వంటివి కాకుండా ఒక ఎమోషన్ కనుక దాగి ఉంటే చేయొచ్చేమో చెప్పలేము అంటూ రాజమౌళి చెప్పుకొచ్చాడు. ఇక అన్య టుటోరియల్ చిత్రాన్ని పల్లవి గంగిరెడ్డి డైరెక్ట్ చేయగా రాజమౌళి స్నేహితులు బాహుబలి నిర్మాతలు అయిన ఆర్కా మీడియా సంస్థ అధినేతలు ఆహా వారితో కలిసి నిర్మిస్తున్నారు.