రాజమౌళితో సినిమా చేసే అవకాశం రావడం అంటే ఆ నిర్మాతకు లాటరీ తగిలినట్టే. హిట్ ప్లాప్ ల ఆలోచన ఆ నిర్మాత పెట్టుకోవాల్సిన అవసరం ఉండదు. కేవలం లాభాల లెక్క గురించి ఆలోచించుకోవడమే తప్ప. అందుకే ఆయనతో మూవీ చేయడానికి నిర్మాతలు రెండు మూడేళ్లకు ముందే అడ్వాన్స్ లు ఇచ్చి ఎదురుచూస్తూ ఉంటారు. అలా ఎప్పుడో రాజమౌళికి ఓ సినిమా కోసం నిర్మాత దానయ్య అడ్వాన్స్ ఇవ్వడం జరిగింది. దానితో బాహుబలి తరువాత రాజమౌళి చేసే సినిమాను నిర్మించే అవకాశం దక్కింది. దానికి తోడు ఎన్టీఆర్, చరణ్ లాంటి స్టార్ హీరోలు నటిస్తున్న మల్టీ స్టారర్ కావడంతో ఈ మూవీ డిమాండ్ అమాంతంగా పెరిగిపోయింది.
కొంత షూటింగ్ తరువాత బాహుబలి నిర్మాత దానయ్యకు ఓ ఆఫర్ ఇవ్వడం జరిగింది. మొత్తంగా 100 కోట్ల రూపాయలు దానయ్యకు శోభు యార్లగడ్డ ఆఫర్ చేశారట. ఆర్ ఆర్ ఆర్ ప్రాజెక్ట్ తనకు అప్పగించి, నిర్మాణం నుండి తప్పుకుంటే తనకు ఆ అమౌంట్ ఇస్తానని అన్నారట. ఐతే ఆర్ ఆర్ ఆర్ కి భారీగా ప్రీ రిలీజ్ బిజినెస్ జరుగుతుందని భావించిన దానయ్య ఆయనకు నో చెప్పారట. అనుకోకుండా వచ్చిన కరోనా విపత్తు ఆర్ ఆర్ ఆర్ భవిష్యత్తు ప్రశ్నార్ధకంగా మార్చింది.
నెలల తరబడి వాయిదాపడుతూ బడ్జెట్ భారం పెంచేస్తుంది. అడ్వాన్సులు ఇచ్చిన బయ్యర్లు వెనక్కి అడుగుతున్నారు. ఇక కరోనా వలన మునుపటి వలె థియేటర్స్ కి జనాలు వస్తారని నమ్మకం లేదు. దీనితో దానయ్యకు టెన్షన్ ఎక్కువైపోతుంది. అప్పట్లో దానయ్యకు ఆఫర్ ఇచ్చిన శోబు యార్లగడ్డ, అనవసరంగా ఇరుక్కునే వాడిని అని సంతోష పడుతున్నారట.