దివంగత ముఖ్యమంత్రి, స్టార్ హీరో అయిన నందమూరి తారకరామారావు గారి శత జయంతి ఉత్సవాలు విజయవాడలో నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజినీకాంత్ హాజరయ్యారు.ఆయన బాలయ్యతో కలిసి ఎయిర్ పోర్ట్ లో దిగిన ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఈ సందర్భంగా సీనియర్ ఎన్టీఆర్ గురించి, బాలయ్య గురించి.. రజినీకాంత్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఆయన మాట్లాడుతూ “బాలకృష్ణ నాకు మంచి మిత్రుడు.
సినిమాల పరంగా (Balakrishna) బాలయ్యకు స్పెషల్ ఫ్యాన్ బేస్ ఉంది. బాలయ్య కంటి చూపుతోనే చంపేస్తాడు. అంతేకాకుండా సినిమాల్లో బాలకృష్ణ చేసే కొన్ని ఫైట్లు బాలీవుడ్ స్టార్ హీరోలు అమీర్ ఖాన్, సల్మాన్, అమితాబ్, నేను చేసినా జనం ఒప్పుకోరు.ఎన్టీఆర్ నన్నెంతో ప్రభావితం చేశారు.. నేను చూసిన మొదటి సినిమా ‘పాతాళభైరవి’. అప్పుడు నాకు ఆరేళ్లు ఉంటాయి. నేను హీరోగా చేసిన తొలి సినిమా పేరు ‘భైరవి’. 13 ఏళ్ళప్పుడు ‘లవకుశ’ సినిమా సమయంలో ఎన్టీఆర్ ను చూసాను.
ఓ సారి ఎన్టీఆర్ వచ్చినప్పుడు చూడడానికి వెళ్తే ఎవరో నన్ను ఎత్తుకుని ఆయన్ని చూపించారు.18 ఏళ్లప్పుడు స్టేజీపై ఎన్టీఆర్ ని ఇమిటేట్ చేశాను. ఆ తర్వాత 1977లో మహానుభావుడితోనే కలిసి టైగర్ సినిమా చేశాను. ఎన్టీఆర్ ఒక యుగ పురుషుడు. ఇక, నా అనుభవం చెబుతోంది.. ఈ వేదికపై రాజకీయం మాట్లాడొద్దని.. నేను రాజకీయం గురించి మాట్లాడితే ఏవేవో రాసేస్తారు” అంటూ రజనీకాంత్ చెప్పుకొచ్చారు.