2010 లో వచ్చిన ‘రోబో’ (Robo) తర్వాత రజినీకి (Rajinikanth) హిట్ అందించిన సినిమా అంటే ‘జైలర్’ (Jailer) అనే చెప్పుకోవాలి. మధ్యలో శంకర్ (Shankar) దర్శకత్వంలో వచ్చిన ‘2.ఓ’ (2.O) కూడా యావరేజ్ రిజల్ట్ తోనే సరిపెట్టుకుంది. ‘జైలర్’ పై కూడా మొదట పెద్దగా అంచనాలు లేవు. ఎందుకంటే రజినీతో పాటు దర్శకుడు నెల్సన్ కూడా ఆ టైంలో ప్లాపుల్లో ఉన్నాడు. మరోపక్క చిరంజీవి (Chiranjeevi) ‘భోళా శంకర్’ (Bhola Shankar) తో పోటీగా రిలీజ్ అయ్యింది ఈ సినిమా. అయినప్పటికీ ఘన విజయం సాధించింది.
Coolie
అందుకు కారణాలు లేకపోలేదు. సినిమాలో రజినీకాంత్ రిటైర్ అయిపోయిన ‘జైలర్’ గా, చనిపోయిన కొడుకు కోసం కృంగిపోయే తండ్రిగా చాలా సాదాసీదాగా కనిపించాడు. అదే సమయంలో వచ్చే ఎలివేషన్స్ అన్ని వర్గాల ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యాయి. మరోపక్క ఈ సినిమాలో శివరాజ్ కుమార్ (Shiva Rajkumar) , మోహన్ లాల్ (Mohanlal) వంటి స్టార్స్ కూడా గెస్ట్ రోల్స్ చేశారు. వాళ్ళ కామియోలు కూడా బాగా హైలెట్ అయ్యాయి. ఏదో ఇరికించినట్టు కాకుండా.. కథని ముందుకు తీసుకెళ్లే విధంగానే ఆ పాత్రల్ని డిజైన్ చేశాడు దర్శకుడు నెల్సన్ (Nelson Dilip Kumar).
ఇక రజినీకాంత్ ప్రస్తుతం లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj) దర్శకత్వంలో చేస్తున్న ‘కూలీ’ (Coolie) చిత్రానికి కూడా ‘జైలర్’ స్ట్రాటజీనే ఫాలో అవుతున్నారట. గోల్డ్ స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే కథ ఇది. రజినీకాంత్ తో పాటు ఈ సినిమాలో (Coolie) కన్నడ సీనియర్ హీరో ఉపేంద్ర(Upendra), టాలీవుడ్ సీనియర్ హీరో నాగార్జున (Nagarjuna) కూడా నటిస్తున్నారు. ‘జైలర్’ లో మాదిరే ‘కూలీ’ లో (Coolie) కూడా వాళ్ళ కామియోలు ఓ రేంజ్లో ఉంటాయట. లోకేష్ కనగరాజ్ ‘విక్రమ్’ (Vikram) లో కూడా సూర్య (Suriya), ఫహాద్ ఫాజిల్ (Fahadh Faasil) వంటి స్టార్స్ ని ఎలా వాడుకున్నాడో అందరికీ తెలిసిందే.