Ram Charan: శంకర్ ఇప్పట్లో చరణ్..ను వదిలేలా లేడుగా.!
- September 25, 2024 / 09:45 AM ISTByFilmy Focus
‘ఆర్.ఆర్.ఆర్’ (RRR) తర్వాత మెగా పవర్ స్టార్ రాంచరణ్ (Ram Charan) ‘గేమ్ ఛేంజర్’ (Game Changer) అనే సినిమాకు సైన్ చేశాడు. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ (Shankar) , స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు (Dil Raju) కాంబినేషన్లో రూపొందుతున్న సినిమా ఇది. దర్శకుడు శంకర్..కి చాదస్తం బాగా ఎక్కువ. 2021 లో ‘గేమ్ ఛేంజర్’ ని ప్రారంభించాడు శంకర్. ఇప్పటికీ ఈ సినిమా రిలీజ్ కాలేదు. ఏదేదో షూట్ చేస్తాడు. తర్వాత అది బాలేదు అని చెప్పి.. దాన్ని డిలీట్ చేయిస్తాడు. ఇలా ‘గేమ్ ఛేంజర్’ విషయంలో రూ.100 కోట్ల ఫుటేజీని అతను వేస్ట్ చేసినట్లు సమాచారం.
Ram Charan

మరోవైపు రాంచరణ్ డేట్స్ కూడా వేస్ట్ చేయించాడట శంకర్. ‘ఆర్.ఆర్.ఆర్’ సినిమాకి కూడా చరణ్ అన్ని డేట్స్ ఇవ్వలేదు అని అతని టీం చెబుతుంది. ‘గేమ్ ఛేంజర్’ తో సమానంగా ‘ఇండియన్ 2’ ని ప్రారంభించి.. ఎక్కువ టైం దానికే కేటాయిస్తూ వచ్చాడట శంకర్. ఈ క్రమంలో చరణ్ డేట్స్ ఇచ్చే టైంకి శంకర్.. ‘ఇండియన్ 2’ (Indian 2) తో బిజీగా ఉండేవాడట. అయినప్పటికీ చాలా కాలం ‘గేమ్ ఛేంజర్’ కోసం ఓపిగ్గా ఉంటూ వచ్చాడు చరణ్.

అయితే రెండు నెలల క్రితం అతని పార్ట్ షూటింగ్ మొత్తం కంప్లీట్ అయ్యింది. ‘ఇండియన్ 2’ ప్రమోషన్స్ లో కూడా శంకర్ ‘చరణ్ పార్ట్ షూట్ కంప్లీట్ అయ్యింది’ అని చెప్పాడు.అయితే ప్రస్తుతం ‘గేమ్ ఛేంజర్’ పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ప్యాచ్ వర్క్ కోసం మళ్ళీ చరణ్ డేట్స్ కావాలి అంటూ దిల్ రాజుని అడిగాడట శంకర్. ఈ క్రమంలో దిల్ రాజు.. రాంచరణ్ డేట్స్ అడగ్గా, అతను సున్నితంగా తిరస్కరించాడట.

ప్రస్తుతం దర్శకుడు బుచ్చిబాబు (Buchi Babu Sana) సినిమా మేకోవర్ కోసం చరణ్ బాగా కష్టపడుతున్నాడట. అందువల్ల ‘గేమ్ ఛేంజర్’ కి డేట్స్ ఇవ్వలేను అని ఓపెన్ గా చెప్పేశాడట. అయితే శంకర్ మాత్రం దిల్ రాజుపై ఒత్తిడి పెంచుతూనే ఉన్నాడట. సో అటు చరణ్, ఇటు శంకర్..ల మధ్య దిల్ రాజు నలిగిపోతున్నట్టు స్పష్టమవుతుంది

















