మెగా పవర్ స్టార్ రాంచరణ్ ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రంతో గ్లోబల్ స్టార్ గా ఎదిగాడు. అతని నెక్స్ట్ సినిమాలు పక్క దేశాల్లో కూడా రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.ముఖ్యంగా జపాన్ లో రాంచరణ్ కి భీభత్సమైన క్రేజ్ ఏర్పడింది. 5 ఏళ్ళ తర్వాత ‘రంగస్థలం’ చిత్రాన్ని అక్కడ రిలీజ్ చేయగా.. భారీ ఓపెనింగ్స్ నమోదయ్యాయి. సో చరణ్ నెక్స్ట్ సినిమాలు అక్కడ హ్యాపీగా రిలీజ్ చేసుకోవచ్చు. ఇదిలా ఉండగా.. రాంచరణ్ ఈ మధ్యన ఎక్కువగా పీరియాడిక్ డ్రామాలే ఎంపిక చేసుకుంటున్నాడు.
‘ఆర్.ఆర్.ఆర్’ పీరియాడిక్ డ్రామానే..! శంకర్ దర్శకత్వంలో చేస్తున్న ‘గేమ్ ఛేంజర్’ లో కూడా పీరియాడిక్ టచ్ ఉంటుంది. ఇప్పుడు ‘బుచ్చిబాబు’ తో చేస్తున్న సినిమా కూడా పీరియాడిక్ డ్రామానే..! ఇలాంటి కథలకే ఇప్పుడు ఎక్కువ డిమాండ్ ఉంది. అందుకే చరణ్.. ఈ పద్దతిని ఎంపిక చేసుకున్నాడు. ఇది పక్కన పెడితే.. రాంచరణ్ .. బుచ్చిబాబుతో చేయబోతున్న సినిమా ఓ స్పోర్ట్స్ డ్రామా. అది కూడా పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామా అని తెలుస్తుంది.
విశాఖపట్టణం, ఈస్ట్ గోదావరి.. ల నేపధ్యం కలిగిన కథ ఇది అని తెలుస్తుంది. వాస్తవానికి చరణ్ .. శంకర్ తో చేస్తున్న ‘గేమ్ ఛేంజర్’ మూవీ పై కంటే బుచ్చిబాబుతో చేస్తున్న సినిమా పైనే సూపర్ కాన్ఫిడెంట్ గా ఉన్నట్టు స్పష్టమవుతుంది. ఎందుకంటే ఈ స్క్రిప్ట్ కి సుకుమార్ కూడా వర్క్ చేశాడు.
‘రంగస్థలం’ తో రాంచరణ్ కి ఓ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఇవ్వడమే కాకుండా.. ఓ కొత్త చరణ్ ను ప్రేక్షకులకు పరిచయం చేశాడు అనే మంచి పేరు తెచ్చుకున్నాడు సుకుమార్. అందుకే (Buchi Babu) బుచ్చిబాబుకి ఇంత త్వరగా రాంచరణ్ తో సినిమా చేసే ఛాన్స్ దక్కింది.