రామ్ చరణ్ (Ram Charan) గేమ్ ఛేంజర్ (Game Changer) సినిమా మొదలై రెండేళ్లు దాటిపోయింది. ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే వచ్చే ఏడాది విడుదల కానున్న సినిమాల రిలీజ్ డేట్లకు సంబంధించి క్లారిటీ వచ్చినా గేమ్ ఛేంజర్ రిలీజ్ డేట్ విషయంలో మాత్రం కన్ఫ్యూజన్ కొనసాగుతోంది. ఇప్పటికే దిల్ రాజు (Dil Raju) పలు సందర్భాల్లో గేమ్ ఛేంజర్ రిలీజ్ డేట్ గురించి లీక్స్ ఇచ్చారనే సంగతి తెలిసిందే. అయితే రామ్ చరణ్ స్వయంగా గేమ్ ఛేంజర్ మూవీ రిలీజ్ డేట్ గురించి స్పష్టత ఇవ్వడం అభిమానులకు మరింత సంతోషాన్ని కలిగిస్తోంది.
తాజాగా వేల్స్ యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్ అందుకున్న రామ్ చరణ్ టాలీవుడ్ ఇండస్ట్రీలో 80 శాతం మందికి చెన్నైతో అనుబంధం ఉందని చెప్పుకొచ్చారు. ఏదైనా సాధించాలనే లక్ష్యంతో ఇక్కడికి వస్తే అది తప్పక నెరవేరుతుందని చరణ్ పేర్కొన్నారు. ఈ ప్రాంతం గొప్పదనం ఇదేనని రామ్ చరణ్ వెల్లడించడం గమనార్హం. ప్రస్తుతం గేమ్ ఛేంజర్ సినిమాలో నటిస్తున్నానని గేమ్ ఛేంజర్ సినిమా కొరకు శంకర్ ఎంతో కష్టపడ్డారని ఆయన చెప్పుకొచ్చారు.
సెప్టెంబర్ లేదా అక్టోబర్ లో ఈ సినిమాను రిలీజ్ చేయాలని అనుకుకుంటున్నామని రామ్ చరణ్ వెల్లడించారు. పొలిటికల్ థ్రిల్లర్ గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. గేమ్ ఛేంజర్ సినిమా అక్టోబర్ నెల 30వ తేదీనే విడుదలయ్యే ఛాన్స్ ఉందని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
గేమ్ ఛేంజర్ సినిమాలో రామ్ చరణ్ ఐఏఎస్ ఆఫీసర్ గా కనిపించనున్నారని సమాచారం అందుతోంది. గేమ్ ఛేంజర్ సినిమాలో రామ్ చరణ్ డ్యూయల్ రోల్ లో నటిస్తుండగా ఈ సినిమాలో ట్విస్టులు సైతం ప్రేక్షకుల అంచనాలకు అందని విధంగా ఉండనున్నాయని తెలుస్తోంది. గేమ్ ఛేంజర్ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన జరగండి సాంగ్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.