ప్రముఖ కథానాయకుడు, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్ వెళ్లిన విషయం తెలిసిందే. ‘ది ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్‌బోర్న్’ కార్యక్రమానికి చరణ్ గౌరవ అతిథిగా హాజరైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో చరణ్ అక్కడి అభిమానులతో సెల్ఫీలు దిగారు. దీనికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దాంతోపాటు మెల్‌బోర్న్ మేయర్ నిక్ రీస్ చేసిన పోస్ట్ కూడా వైరల్‌గా మారింది. తాను రామ్ చరణ్‌కు వీరాభిమాని అని పేర్కొంటూ నిక్ రీస్ చేసిన ఓ పోస్ట్, అందులోని ఫొటోలే వైరల్‌గా మారడానికి కారణాలు.
Ram Charan
అడిలైడ్ నగరాన్ని గొప్పగా మార్చడంలో ఇక్కడ ఉంటున్న భారతీయులు పెద్ద పాత్ర పోషిస్తున్నారు. డిప్యూటీ మేయర్ అభ్యర్థి రోషెనాతో కలసి ఇటీవల భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు వెళ్లాను. రామ్ చరణ్‌తో సెల్ఫీ తీసుకున్నా అంటూ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు నిక్ రీస్. దాంతోపాటు నా ఇన్నేళ్ల కోరిక తీరింది. నా విష్ లిస్ట్‌లో ఉన్న ఒక పని పూర్తయింది అని రీస్ రాసుకొచ్చారు. చరణ్‌తో ఎలాగైనా ఫొటో దిగాలని ఎప్పటి నుండో రీస్ అనుకుంటున్నారట.
ఆ పని పూర్తవ్వడంతోనే ఈ పోస్టు పెట్టారు. అక్టోబర్‌లో జరిగే ఎన్నికల్లో రోషెనా.. డిప్యూటీ మేయర్‌గా ఎన్నికైతే చరిత్ర సృస్టిస్తారు. 182 సంవత్సరాల చరిత్ర ఉన్న ఆ స్థానాన్ని గెలుచుకున్న భారతీయ వారసత్వపు మొదటి వ్యక్తి అవుతారు అని ఆయన తెలిపారు. మెల్‌బోర్న్‌లో 15వ ‘ది ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్‌బోర్న్’కి గౌరవ అతిథిగా రామ్ చరణ్ హాజరయ్యారు.
ఈ క్రమంలో ఆయన ఆస్ట్రేలియాలో మన జెండా ఎగురవేశారు. ఆ తర్వాత ఆయన మాట్లాడుతూ మెల్‌బోర్న్ అంటే తనకెంతో ఇష్టం అంటూ ‘ఆరెంజ్’ (Orange) సినిమా రోజులను గుర్తు చేసుకున్నారు చరణ్. ప్రస్తుతం రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’ (Game Changer) సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా డిసెంబర్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది.