రామ్ చరణ్ సినీ కెరీర్ లోని బ్లాక్ బస్టర్ సినిమాలలో మగధీర సినిమా ఒకటనే సంగతి తెలిసిందే. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అందరినీ ఈ సినిమా ఆకట్టుకుంది. రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా కేవలం 40 కోట్ల రూపాయల బడ్జెట్ తోనే తెరకెక్కినా ఫుల్ రన్ లో బడ్జెట్ కు రెట్టింపు స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకోవడం గమనార్హం. అయితే ఈ మధ్య కాలంలో పలువురు స్టార్ హీరోల సినిమాలు రీరిలీజ్ అవుతుండగా ఇప్పుడు రామ్ చరణ్ వంతు వచ్చిందని సమాచారం.
రామ్ చరణ్ సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి 15 సంవత్సరాలు కావడంతో మగధీర సినిమాను మద్దిలపాలెంలోని కిన్నెర థియేటర్ లో ప్రదర్శించనున్నారని బోగట్టా. ఈ నెల 28వ తేదీన మగధీర స్పెషల్ షో ప్రదర్శితం కానుండగా ఇప్పటికే బుకింగ్స్ మొదలయ్యాయి. మగధీర సినిమాను థియేటర్లలో చూడటానికి ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తుండటం గమనార్హం. మగధీర సినిమా రీరిలీజ్ లో ఎక్కువ థియేటర్లలో రిలీజ్ కావడం లేదు.
అయితే ఈ సినిమా కిన్నెర థియేటర్ లో ఏ స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకుంటుందో చూడాల్సి ఉంది. మగధీర సినిమాను పరిమిత సంఖ్యలో థియేటర్లలో కూడా ప్రదర్శించనున్నారని తెలుస్తోంది. త్వరలో మరిన్ని సినిమాలు థియేటర్లలో రీరిలీజ్ కానున్నాయని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపిస్తుండటం గమనార్హం. పోకిరి సినిమా రీరిలీజ్ వల్ల బ్లాక్ బస్టర్ సినిమాల రీరిలీజ్ కు ప్రాధాన్యత ఏర్పడిందని కామెంట్లు వినిపిస్తున్నాయి.
మగధీర సినిమా రీరిలీజ్ కానుండటంతో అభిమానులు ఎంతగానో సంతోషిస్తున్నారు. మగధీర టాలీవుడ్ ఇండస్ట్రీ హిట్లలో ఒకటిగా నిలవడంతో కొత్త రకం స్క్రీన్ ప్లేతో తెరకెక్కి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. రాజమౌళి కెరీర్ కు ఈ సినిమా ఎంతగానో ప్లస్ అయింది. పరిమిత బడ్జెట్ తోనే అద్భుతాలు సృష్టించగలనని జక్కన్న ఈ సినిమాతో ప్రూవ్ చేశారు.