సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన తమిళ చిత్రం పడయప్ప ఏ స్థాయి విజయాన్ని సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ సినిమా తెలుగు లో నరసింహగా డబ్ అయింది. ఒక తెలుగు సినిమా స్థాయిలో ఇక్కడ కూడా భారీ విజయాన్ని సొంతం చేసుకుని అప్పట్లో వసూళ్ల వర్షం కురిపించింది అనడంలో సందేహం లేదు. ఆ సినిమాకు సంబంధించిన ఆసక్తికర విషయాలను తాజాగా ఒక చిట్ చాట్ లో రమ్యకృష్ణ షేర్ చేసుకున్నారు.
సినిమాలో రమ్యకృష్ణ (Ramya Krishna) పాత్ర ఎప్పటికి గుర్తుండి పోతుంది. నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో రమ్యకృష్ణ నటించిన విషయం తెల్సిందే. ఎలాగైనా రజినీకాంత్ ను దక్కించుకోవాలనుకునే నీలాంభరి పాత్రలో రమ్యకృష్ణ నటించింది. తాను ప్రేమించిన వ్యక్తిని సౌందర్య పెళ్లి చేసుకోబోతుందని తెలిసి ఆమె రియాక్ట్ అయ్యే సన్నివేశాలు సినిమాకు హైలైట్. సౌందర్య తన పని మనిషి. తన పని మనిషి తాను ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకోవడం తట్టుకోలేక పోతుంది.
అప్పుడే సౌందర్య చెంపపై కాలు పెడుతుంది. తన కాలి కింద ఉండేదానికి అంటూ డైలాగ్ చెబుతుంది. ఆ సన్నివేశం ను చేసేందుకు రమ్యకృష్ణ మొదట ఒప్పుకోలేదట. కానీ సౌందర్య మరియు దర్శకుడు ఒప్పించి మరీ రమ్యకృష్ణ తో చేయించారట. ఆ సన్నివేశానికి అలా చేయడం చాలా ముఖ్యం. సినిమాలోని నీలాంబరి పాత్ర తీరును ఆ సన్నివేశం చూపిస్తుంది.
కనుక అలా చేయడం తప్పులేదని వారు చెప్పడం వల్ల తాను అలా చేయడం జరిగింది… కానీ సౌందర్య కాలుపై నా పాదం పెట్టడం చాలా కష్టం అనిపించిందని రమ్యకృష్ణ అంది. అలా చేసినందుకు అప్పట్లో చాలా మంది నన్ను తిట్టారు అని అప్పటి జ్ఞాపకాలను రమ్యకృష్ణ చెప్పుకొచ్చింది.