Rashmika: రిటైర్మెంట్ గురించి ఆసక్తికర కామెంట్లు చేసి రష్మిక మందన.. ఏమందంటే?
- January 23, 2025 / 03:38 PM ISTByFilmy Focus Desk
వరుస సినిమాలు, అందులోనూ పాన్ ఇండియా సినిమాలు చేస్తున్న పాన్ ఇండియా హీరోయిన్ రష్మిక మందన (Rashmika Mandanna) ఇటీవల తన రిటైర్మెంట్ గురించి మాట్లాడింది. ఇప్పుడు రిటైర్మెంటా? అంత కంగారేమొచ్చింది అనుకోవచ్చు. అయితే ఆమె రిటైర్మెంట్ గురించి మాట్లాడటానికి కారణం ఇప్పుడు చేస్తున్న సినిమా గొప్పతనం గురించి చెప్పడమే. ఆ సినిమా ‘ఛావా’ (Chhaava). ఈ సినిమా ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమం ఇటీవల ముంబయిలో జరిగతింది. విక్కీ కౌశల్(Vicky Kaushal), రష్మిక ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ఛావా’.
Rashmika

ఛత్రపతి శివాజీ తనయుడు శంభాజీ జీవితం ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమా ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే ట్రైలర్ రిలీజ్ వేడుక చేశారు. అందులోనే రష్మిక రిటైర్మెంట్ గురించి సరదాగా మాట్లాడింది. దీంతో ఆమె కామెంట్స్ వైరల్‌గా మారాయి. ‘ఛావా’ సినిమాలో శంభాజీ భార్య ఏసుబాయిగా నటించే అవకాశం రావడం నాకు దక్కిన గౌరవం. నటిగా నాకు ఇంతకు మించి ఏం కావాలి.

ఈ సినిమా తర్వాత నేను సంతోషంగా రిటైర్ అవ్వగలను, అంత గొప్ప పాత్ర ఇది అని చెప్పింది రష్మిక. ఇక ఈ సినిమా షూటింగ్ సమయంలో ఎన్నోసార్లు భావోద్వేగానికి గురయ్యానని, ట్రైలర్ చూశాక కూడా ఎమోషనల్ అయ్యానని ఆమె తెలిపింది. అన్నట్లు ఈ సినిమా ట్రైలర్‌లో ‘‘సింహం లేకుండా ఉండొచ్చు కానీ.. ఆ సింహానికి పుట్టిన ఛావా ఇంకా బతికే ఉంది.. మరాఠాలను సవాలు చేయడానికి ధైర్యం చేస్తే మొఘల్ సామ్రాజ్యాన్నే లేకుండా చేస్తాం’’ లాంటి పవర్ ఫుల్ డైలాగ్స్ చాలానే ఉన్నాయి.

మరోవైపు ఈ ఈవెంట్‌కి గాయంతోనే ట్రైలర్ రిలీజ్ ఈవెంట్‌కు రష్మిక వచ్చింది.ఇటీవల ఆమె జిమ్‌లో వర్కౌట్లు చేస్తుండగా కాలికి గాయమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రెస్ట్ తీసుకోకుండా ముంబయిలో జరిగిన ‘ఛావా’ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్‌కు గాయంతోనే వెళ్లారు. వేదికపైకి ఒక కాలితో కుంటుకుంటూ రష్మిక వచ్చింది. ఆ సమయంలో విక్కీ సాయం చేశారు. అంతకుముందు ఎయిర్‌పోర్ట్‌లో ఆమె ఇబ్బందిపడుతూ వచ్చిన వీడియో కూడా వైరల్ అయింది.
I watched the #Chhaava trailer, which I thought was amazing. But if someone has truly won hearts today, it’s @iamRashmika. The courage she has shown today is incredible. She has completely justified her character of Yesubai. I’m proud to be her fan. #RashmikaMandanna #Chhaava pic.twitter.com/qESnP8yW4c
— Rashmika Delhi Fans (@Rashmikadelhifc) January 22, 2025












