విజయ్ దేవరకొండకు ‘కింగ్డమ్’ పెద్ద రిలీఫ్ అనే చెప్పాలి. ఎందుకంటే బాక్సాఫీస్ వద్ద అతని హవా ఒకప్పటితో పోలిస్తే కొంచెం తగ్గింది. ‘అర్జున్ రెడ్డి’ ‘గీత గోవిందం’ వంటి సినిమాలతో బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించిన విజయ్ దేవరకొండ ఆ తర్వాత వరుస ప్లాపులతో కొంచెం వెనుకబడ్డాడు.
‘టాక్సీవాలా’ తర్వాత ఆల్మోస్ట్ 7 ఏళ్ళ వరకు అతనికి హిట్ పడలేదు.అయితే ఈరోజు రిలీజ్ అయిన ‘కింగ్డమ్’ మంచి టాక్ తెచ్చుకుంది. ఓపెనింగ్స్ కూడా బాగా రిజిస్టర్ అవుతున్నాయి. టైర్ 2 అంటే మిడ్ రేంజ్ హీరోల్లో భారీ ఓపెనింగ్స్ సాధించిన హీరోగా విజయ్ దేవరకొండ ‘కింగ్డమ్’ తో నిలిచే అవకాశాలు ఉన్నాయి. విజయ్ దేవరకొండ కెరీర్ లో కూడా ‘కింగ్డమ్’ కి భారీ ఓపెనింగ్స్ నమోదయ్యే అవకాశం ఉంది.
అంతా బాగానే ఉంది కానీ.. ఈ సినిమా పై ఓ సెక్షన్ ఆఫ్ మీడియా విషం జిమ్ముతున్నట్టు కూడా కనిపిస్తుంది. గతంలో విజయ్ దేవరకొండ స్పీచ్..లకి వంకలు పెట్టి అతని సినిమాలను టార్గెట్ చేసేవారు. కానీ ‘కింగ్డమ్’ కి విజయ్ చాలా కంట్రోల్లోకి వచ్చాడు. ఈ సినిమా ప్రమోషన్స్ లో అతను చాలా మెచ్యూర్డ్ గా కనిపించాడు. మాట్లాడేటప్పుడు చాలా శ్రద్ధ వహించాడు. అయినా ఎందుకు ‘కింగ్డమ్’ ని కొంతమంది టార్గెట్ చేసినట్లు? అంటే నిర్మాత నాగవంశీ వల్ల అనే చెప్పాలి. ఎందుకంటారా? అవును నాగవంశీ ముక్కుసూటి తనం వల్ల.. ఓ సెక్షన్ ఆఫ్ మీడియాపై అతను విరుచుకుపడ్డాడు. అలాగే కొంతమంది పీఆర్ లపై నోరు పారేసుకున్నాడు. సో ఆ పీఆర్..ల తాలూకా మీడియానే నాగవంశీని, ‘కింగ్డమ్’ సినిమాని టార్గెట్ చేసినట్లు ఇండస్ట్రీలో టాక్ గట్టిగా వినిపిస్తోంది. మరి ఈ నెగిటివిటీని తట్టుకుని నాగవంశీ ‘కింగ్డమ్’ని ఎలా నిలబెడతాడో చూడాలి.