• Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • OTT
  • వెబ్ స్టోరీస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • వీడియోస్
తెలుగు
  • English
  • தமிழ்
  • Featured Stories
  • Movies
  • Movie News
  • Focus
  • Reviews
  • Collections
  • వెబ్ స్టోరీస్
  • బిగ్ బాస్ 6
  • Videos
  • Trailers
Hot Now
  • ఆరోజు నుంచి వీరసింహారెడ్డి స్ట్రీమింగ్
  • ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో సినిమాల లిస్ట్
  • టాలీవుడ్ లో రీమిక్స్ చేసిన 20 పాటలు
  • రాజమౌళి మెచ్చిన పది సినిమాలు ఏవో తెలుసా?

Filmy Focus » Focus » ‘తొలిప్రేమ’ టు ‘ఖుషి’.. రిపీట్ అవుతున్న పాత సినిమా టైటిల్స్ ఇవే..!

‘తొలిప్రేమ’ టు ‘ఖుషి’.. రిపీట్ అవుతున్న పాత సినిమా టైటిల్స్ ఇవే..!

  • May 17, 2022 / 12:16 PM IST
  • | Follow Us
  • Filmy Focus Google News
‘తొలిప్రేమ’ టు ‘ఖుషి’.. రిపీట్ అవుతున్న పాత సినిమా టైటిల్స్ ఇవే..!

ఓల్డ్ ఈజ్ గోల్డ్..అని చాలా మంది అంటుంటారు. ఎప్పటికీ పాతబడని వాక్యం ఇది. సరిగ్గా అప్ కమింగ్ ఫిలిమ్స్ కూడా ఇదే పద్దతిని ఫాలో అవుతున్నాయి. ఏ విషయంలో అంటారా… పాత సినిమాల టైటిల్స్ ను వాడుకునే విషయంలో. గతంలో సూపర్ హిట్ అయిన సినిమా టైటిల్ ను వాడుకుంటే క్రేజ్ బాగా వస్తుందనో… లేక కథ డిమాండ్ చేయడం వలనో కానీ.. చాలా మంది యంగ్ హీరోలు పాత సినిమాల టైటిల్స్ ను తమ అప్ కమింగ్ ఫిలిమ్స్ కు పెట్టుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.యంగ్ హీరోలు మాత్రమే కాదు ఈ లిస్ట్ లో చాలా మంది ఉన్నారు కాకపోతే యంగ్ హీరోలు ముందు ఉన్నారు. అయితే హిట్టు సినిమా టైటిల్ పెట్టుకున్నంత మాత్రాన సినిమా హిట్ అయిపోతుంది అనుకోవడం అతిశయోక్తి అవుతుంది.

కథ డిమాండ్ మేరకు సినిమా టైటిల్ ను పెట్టుకోవాలి. పైగా పాత హిట్ సినిమాల టైటిల్స్ ను పెట్టుకుని సినిమా బాలేదు అంటే ముందుగా జనాలు టైటిల్ గురించే ఎక్కువ తిడతారు. ఓ సూపర్ హిట్ సినిమా లేదా క్లాసిక్ సినిమా టైటిల్ ను చెడగొట్టారు అని. ఈ విషయాన్ని ఇప్పటికే చాలా సినిమాలు ప్రూవ్ చేశాయి. సరే మరీ పర్సనల్ గా తీసుకోవడం ఎందుకు కానీ.. పాత సినిమాల టైటిల్ ను వాడుకున్న.. వాడుకుంటున్న హీరోలు ఎవరో, ఒకవేళ పాత సినిమాల టైటిల్స్ ను వాడుకోవడం వల్ల వాళ్ళ సినిమాలు హిట్ అయ్యాయో లేక ప్లాప్ అయ్యాయో… అన్న విషయాలను ఓ లుక్కేద్దాం రండి :

1) తొలిప్రేమ :

ఈ టైటిల్ తో 1999 లో పవన్ కళ్యాణ్- కరుణా కరణ్ కాంబినేషన్లో ఓ సినిమా వచ్చింది. అది కల్ట్ క్లాసిక్ లవ్ స్టోరీగా మిగిలింది. 2018 లో వరుణ్ తేజ్ ఈ టైటిల్ ను తన సినిమాకి పెట్టుకున్నాడు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం సూపర్ హిట్ అయ్యింది.

2) గూఢచారి :

‘గూఢచారి 116’ పేరుతో సూపర్ స్టార్ కృష్ణ గారి మూవీ ఒకటి వచ్చింది. జేమ్స్ బాండ్ తరహా మూవీ అది. 2018 లో అడివి శేష్ ‘గూఢచారి’ అనే సినిమా చేశాడు. పాత టైటిల్ ను వాడుకుని సూపర్ హిట్ అందుకున్నాడు. కథాంశం కూడా అదే రేంజ్లో ఉంటుంది.

3) దేవదాస్ :

అక్కినేని నాగేశ్వర రావు గారి కల్ట్ క్లాసిక్ మూవీ ఇది. ఇదే టైటిల్ తో నాగార్జున- నాని ఓ క్రైమ్ థ్రిల్లర్ మూవీ చేశారు.2018లో వచ్చిన ఈ మూవీ ప్లాప్ అయ్యింది.

4) ఖైదీ :

చిరంజీవిని స్టార్ హీరోని చేసిన మూవీ ఇది. అయితే ఇదే టైటిల్ ను కార్తీ 2019 లో వాడుకున్నాడు. ఈ ‘ఖైదీ’ కూడా బ్లాక్ బస్టర్ అయ్యింది.

5) మహర్షి :

డైరెక్టర్ వంశీ గారు తీసిన లవ్ స్టోరీ ఇది.. 2019 లో ఈ టైటిల్ ను మహేష్ బాబు తన 25వ సినిమా కోసం వాడుకున్నాడు. ఈ మూవీ కూడా హిట్ అయ్యింది.

6) గ్యాంగ్ లీడర్ :

చిరంజీవి హీరోగా వచ్చిన సూపర్ హిట్ మూవీ టైటిల్ ఇది. దీనిని 2019 లో నాని వాడుకున్నాడు. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ ప్లాప్ అయ్యింది.

7) సుల్తాన్ :

బాలకృష్ణ ట్రిపుల్ రోల్ ప్లే చేసిన మూవీకి ఈ టైటిల్ పెట్టారు. ఆ సినిమా ప్లాప్ అయ్యింది. అదే టైటిల్ ను కార్తీ వాడుకున్నాడు. ఫలితంలో పెద్ద తేడా అయితే లేదు.

8) విజేత :

చిరంజీవి హీరోగా వచ్చిన సూపర్ హిట్ మూవీ టైటిలే ఇది కూడా..! 2018 లో చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ ఈ టైటిల్ ను వాడుకున్నాడు. అయితే ఈ మూవీ ప్లాప్ అయ్యింది.

9) మేజర్ :

చిరంజీవి కన్నడలో డబ్బింగ్ రోల్ ప్లే చేసిన ‘సిపాయి’ చిత్రాన్ని తెలుగులో ‘మేజర్’ గా రిలీజ్ చేశారు.కానీ ఇక్కడ ఆ మూవీ ఆడలేదు. ఇప్పుడు ఇదే టైటిల్ తో అడివి శేష్ హీరోగా ఓ సినిమా రూపొందుతుంది. ఇదెలా ఉంటుందో చూడాలి.

10) దొంగ :

చిరంజీవి హీరోగా అనే చిత్రం వచ్చింది. ఈ మూవీ యావరేజ్ గా ఆడింది. 2020 లో ఇదే టైటిల్ ను కార్తీ హీరోగా చేసిన మూవీకి పెట్టుకున్నాడు. ఈ మూవీ ఆడలేదు.

11) విక్రమ్ :

నాగార్జున హీరోగా ఎంట్రీ ఇచ్చిన మూవీ పేరు ‘విక్రమ్’. ఇదే టైటిల్ తో కమల్ హాసన్ నటించిన విక్రమ్ మూవీ త్వరలో రాబోతుంది.

12) ఖుషి :

పవన్ కళ్యాణ్ నటించిన ఈ మూవీ ఆల్ టైం బిగ్గెస్ట్ హిట్ గా, అలాగే కల్ట్ క్లాసిక్ మూవీగా నిలిచింది. ఈ చిత్రం టైటిల్ ను విజయ్ దేవరకొండ వాడుకుంటున్నాడు. సమంత ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తుంది. మరి ఈ మూవీ రిజల్ట్ ఎలా ఉంటుందో చూడాలి..!

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Devadas
  • #Donga
  • #gang leader
  • #Goodachari
  • #Khaidi

Also Read

OTT Releases: ఈ వీకెండ్ కు ఓటీటీల్లో సందడి చేయబోతున్న 15 సినిమాల లిస్ట్..!

OTT Releases: ఈ వీకెండ్ కు ఓటీటీల్లో సందడి చేయబోతున్న 15 సినిమాల లిస్ట్..!

Vijay Devarakonda, Rashmika: విజయ్- రష్మిక …మళ్ళీ దొరికేశారు..  ఈసారి క్లారిటీ వచ్చేసినట్టేనా..!

Vijay Devarakonda, Rashmika: విజయ్- రష్మిక …మళ్ళీ దొరికేశారు.. ఈసారి క్లారిటీ వచ్చేసినట్టేనా..!

Waltair Veerayya Collections: ‘వాల్తేరు వీరయ్య’ 19 రోజుల కలెక్షన్స్ ఎలా ఉన్నాయంటే ..!

Waltair Veerayya Collections: ‘వాల్తేరు వీరయ్య’ 19 రోజుల కలెక్షన్స్ ఎలా ఉన్నాయంటే ..!

Nayanthara: నయనతార ఆస్తులకు సంబంధించిన ఆసక్తికర విషయాలు..

Nayanthara: నయనతార ఆస్తులకు సంబంధించిన ఆసక్తికర విషయాలు..

Pathaan Collections: తెలుగు రాష్ట్రాల్లో సేఫ్.. లాభాల బాట పట్టిన ‘పఠాన్’..!

Pathaan Collections: తెలుగు రాష్ట్రాల్లో సేఫ్.. లాభాల బాట పట్టిన ‘పఠాన్’..!

Waltair Veerayya Collections: ‘వాల్తేరు వీరయ్య’ జోరు ఇంకా తగ్గలేదు ..!

Waltair Veerayya Collections: ‘వాల్తేరు వీరయ్య’ జోరు ఇంకా తగ్గలేదు ..!

related news

Samantha: సమంత మీద ఫైర్ అవుతున్న విజయ్ దేవరకొండ ఫ్యాన్స్.. కారణం ఏంటంటే..

Samantha: సమంత మీద ఫైర్ అవుతున్న విజయ్ దేవరకొండ ఫ్యాన్స్.. కారణం ఏంటంటే..

టాలీవుడ్ లో రీమిక్స్ చేసిన 20 తెలుగు పాటలు ఇవే!

టాలీవుడ్ లో రీమిక్స్ చేసిన 20 తెలుగు పాటలు ఇవే!

Chiranjeevi: చిరంజీవి మూవీ బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తుందా?

Chiranjeevi: చిరంజీవి మూవీ బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తుందా?

Khushi: పుకార్లకు చెక్ పెట్టిన ‘ఖుషి’ డైరెక్టర్!

Khushi: పుకార్లకు చెక్ పెట్టిన ‘ఖుషి’ డైరెక్టర్!

Lokesh Kanagaraj: లోకేశ్ కనగరాజ్‌ క్లైమాక్స్‌ ఫార్ములా ఇప్పుడు పాన్‌ ఇండియా…

Lokesh Kanagaraj: లోకేశ్ కనగరాజ్‌ క్లైమాక్స్‌ ఫార్ములా ఇప్పుడు పాన్‌ ఇండియా…

Vijay Deverakonda: కొత్త సినిమాపై విజయ్‌ ఓపిక నశించిందా.. అలా అన్నాడా?

Vijay Deverakonda: కొత్త సినిమాపై విజయ్‌ ఓపిక నశించిందా.. అలా అన్నాడా?

trending news

Chiranjeevi: మొన్న నాగబాబు, నేడు చిరంజీవి సాయం.. కన్నీంటిపర్యంతమైన నటి పాకీజా..

Chiranjeevi: మొన్న నాగబాబు, నేడు చిరంజీవి సాయం.. కన్నీంటిపర్యంతమైన నటి పాకీజా..

26 mins ago
Balakrishna: తారకరత్న కోసం మృత్యుంజయ ఆలయంలో అఖండ జ్యోతి వెలిగించిన బాలయ్య

Balakrishna: తారకరత్న కోసం మృత్యుంజయ ఆలయంలో అఖండ జ్యోతి వెలిగించిన బాలయ్య

27 mins ago
Kantara TRP: ‘కె.జి.ఎఫ్’ కంటే ‘కాంతార’ కి ఎక్కువ…  టీవీల్లో కూడా బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘కాంతార’

Kantara TRP: ‘కె.జి.ఎఫ్’ కంటే ‘కాంతార’ కి ఎక్కువ… టీవీల్లో కూడా బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘కాంతార’

1 hour ago
Veera Simhareddy: వీరసింహారెడ్డి కథ వెనుక ఈ షాకింగ్ విషయాలు తెలుసా?

Veera Simhareddy: వీరసింహారెడ్డి కథ వెనుక ఈ షాకింగ్ విషయాలు తెలుసా?

1 hour ago
శరీరం కాలిపోయి మంటల్లో చిక్కుకున్న నటికి ఆసుపత్రిలో చికిత్స..!

శరీరం కాలిపోయి మంటల్లో చిక్కుకున్న నటికి ఆసుపత్రిలో చికిత్స..!

1 hour ago

latest news

పెళ్లిపీటలెక్కుతున్న ‘అర్జున్ రెడ్డి’ పనిమనిషి.. వైరల్ అవుతున్న ఫోటోలు, వీడియోలు..

పెళ్లిపీటలెక్కుతున్న ‘అర్జున్ రెడ్డి’ పనిమనిషి.. వైరల్ అవుతున్న ఫోటోలు, వీడియోలు..

2 hours ago
Project K: ‘ప్రాజెక్ట్‌ K’ విషయంలో నాగీ కీలక నిర్ణయం.. నిజమైతే!

Project K: ‘ప్రాజెక్ట్‌ K’ విషయంలో నాగీ కీలక నిర్ణయం.. నిజమైతే!

2 hours ago
Thaman: అంచనాలు పెంచేసిన థమన్.. చరణ్ మూవీ అలా ఉంటుందా?

Thaman: అంచనాలు పెంచేసిన థమన్.. చరణ్ మూవీ అలా ఉంటుందా?

3 hours ago
Pawan Kalyan: ‘తమ్ముడు’ ఫైట్స్‌ డూప్‌ చేశాడా.. పవన్‌ సమాధానం ఏంటంటే?

Pawan Kalyan: ‘తమ్ముడు’ ఫైట్స్‌ డూప్‌ చేశాడా.. పవన్‌ సమాధానం ఏంటంటే?

3 hours ago
Kiccha Sudeep: తన జీవితంలో కీలక వ్యక్తి గురించి చెప్పిన సుదీప్‌.. ఎవరంటే?

Kiccha Sudeep: తన జీవితంలో కీలక వ్యక్తి గురించి చెప్పిన సుదీప్‌.. ఎవరంటే?

3 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Home
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2022 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • Home
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us