‘అఆ’(A AA) తర్వాత నితిన్ కు (Nithiin) వరుస ప్లాపులు పడ్డాయి. అలాంటి టైంలో ‘భీష్మ’ (Bheeshma) తో హిట్ ఇచ్చి ఆదుకున్నాడు దర్శకుడు వెంకీ కుడుముల . ఆ తర్వాత మళ్ళీ నితిన్ ను వరుస ప్లాపులు వెంటాడాయి. సరైన హిట్టు కోసం ఎదురుచూస్తున్న టైంలో ఇప్పుడు ‘రాబిన్ హుడ్’ (Robinhood) వస్తుంది. దీనికి కూడా వెంకీ కుడుములనే (Venky Kudumula) దర్శకుడు. వాస్తవానికి ఈ సినిమా డిసెంబర్ 25న రిలీజ్ అవుతుందని నిర్మాతలు ప్రకటించారు. కానీ అప్పుడు ఇదే బ్యానర్ నుండి ‘పుష్ప 2’ (Pushpa 2) వచ్చింది.
దాని బాక్సాఫీస్ హవా ముందు దీని ప్రమోషన్స్ కనిపించలేదు. దీన్ని గమనించి వెంటనే వాయిదా వేశారు. ఆ తర్వాత నెలలో ఈ సినిమా రిలీజ్ అవుతుంది అనుకుంటే..సరైన రిలీజ్ డేట్ పట్టడానికి 3 నెలల టైం పట్టింది. మొత్తానికి మార్చి 28న వస్తుంది ‘రాబిన్ హుడ్’ (Robinhood). ప్రమోషన్స్ గట్టిగా చేశారు. కానీ ఆడియన్స్ కి అవి చేరాయా అంటే.. సో సో..! అంతకు మించి సమాధానం ప్రస్తుతానికి వినిపించడం లేదు. నితిన్ ప్లాపుల్లో ఉన్నాడు. శ్రీలీల (Sreeleela) కూడా ఫామ్లో లేదు.
దర్శకుడు వెంకీ కుడుముల నుండి సినిమా వచ్చి 5 ఏళ్ళు అయ్యింది. అందుకే ‘రాబిన్ హుడ్’ పై హైప్ ఎక్కువ లేదు. కానీ మార్చి 28 కి పరీక్షల సీజన్ క్లైమాక్స్ కి వచ్చేస్తుంది. పైగా ఉగాది, సండే, మండే రంజాన్ ఉండటం వల్ల పండుగ సెలవులు ఈ సినిమాకి కొంత కలిసి రావచ్చు. కామెడీ ఉందని ప్రచారం చేశారు కాబట్టి… కొద్దిపాటి ప్రేక్షకులైన థియేటర్ కి వస్తారు. వాళ్ళు శాటిస్ఫై అయితే.. పాజిటివ్ రిపోర్ట్స్ తో తర్వాత బాగా పికప్ అయ్యే ఛాన్స్ ఉన్నట్టే.