Rowdy Janardhan: విజయ్ న్యూ ప్రాజెక్ట్.. జస్ట్ నాలుగు నెలల్లోనే..!
- April 12, 2025 / 09:15 AM ISTByFilmy Focus Desk
విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) ఇప్పుడు స్పీడ్ పెంచేశాడు. వరుసగా పాన్ ఇండియా సినిమాలతో బిజీగా మారిన విజయ్, గౌతమ్ తిన్ననూరితో (Gowtam Tinnanuri) చేస్తున్న కింగ్‌డమ్ (Kingdom) సినిమాను మే 30న విడుదలకు రెడీ చేస్తున్నాడు. అదే సమయంలో రాహుల్ సంకృత్యాన్ (Rahul Sankrityan) దర్శకత్వంలో మరో భారీ సినిమా లైన్‌లో ఉంది. వీటి తర్వాత త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లబోయే ప్రాజెక్ట్ ‘రౌడీ జనార్దన్’ (Rowdy Janardhan) కూడా మంచి హైప్ తెచ్చుకుంటోంది. ఈ సినిమాకు రవికిరణ్ కోలా (Ravi Kiran Kola) దర్శకత్వం వహించబోతున్నారు.
Rowdy Janardhan

ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తి అయిపోయిందనీ, జూన్ నుంచే షూటింగ్ మొదలవుతుందని సమాచారం. డిసెంబర్‌లో సినిమాను విడుదల చేయాలన్నది మేకర్స్ ప్లాన్. అంటే కేవలం నాలుగు నెలల్లో షూటింగ్ పూర్తి చేసి, సమయాన్ని ఫలదాయకంగా వినియోగించాలనుకుంటున్నారు. ఈ జెట్ స్పీడ్ వర్క్ ప్లాన్ ఇండస్ట్రీలో ఆశ్చర్యం కలిగిస్తోంది. ఈ సినిమాలో విజయ్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటించే ఛాన్స్ ఉన్నట్టు టాక్.
ఫ్రెష్ కాంబినేషన్ కావడంతో ఇది సినిమాకు మరో ఆకర్షణగా మారనుంది. మాస్, ఫ్యామిలీ, యూత్ ఆడియన్స్‌కు కలిపేలా స్క్రిప్ట్ రెడీ చేశారట. యాక్షన్, ఎమోషన్, కామెడీ, రొమాన్స్ అన్ని మిక్స్ అయ్యే పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్‌గా ‘రౌడీ జనార్దన్’ రూపొందనుందట. ‘ఫ్యామిలీ స్టార్’ (Family Star) ఫలితం నెగిటివ్ గా వచ్చినప్పటికీ, దిల్ రాజు(Dil Raju) ఈ ప్రాజెక్ట్ మీద పూర్తి నమ్మకంతో ఉన్నారు. రవికిరణ్ కోలా గతంలో తీసిన ‘రాజావారు రాణిగారు’ ద్వారా మంచి నేటివిటీ టచ్ చూపించగా, అదే టోన్‌ను ఈసారి విజయ్ స్టైల్‌తో మిక్స్ చేయబోతున్నారు.

అందుకే ఈ సినిమాపై మంచి బజ్ క్రియేట్ అవుతోంది. విజయ్ కెరీర్‌లో ఇది చాలా కీలకమైన ప్రాజెక్ట్ కానుంది. అయితే జస్ట్ నాలుగు నెలల్లో సినిమా పూర్తి చేయడం సాధ్యమా అనేది అనుమానంగా ఉన్నా, టీమ్ కసరత్తు చూస్తే ఇది కచ్చితంగా సాధ్యమేననే ఫీలింగ్ ఫ్యాన్స్‌లో మొదలైంది.














