‘బాహుబలి'(సిరీస్) తర్వాత రాజమౌళి తెరకెక్కించిన భారీ చిత్రం ‘ఆర్.ఆర్.ఆర్’.థియేటర్లలో రిలీజ్ అయినప్పుడు బాక్సాఫీస్ వద్ద ఎన్నో అద్భుతాలు చేసిన ‘ఆర్.ఆర్.ఆర్’.. థియేట్రికల్ రన్ ముగిశాక కూడా విజయపరంపర కొనసాగిస్తుందనే చెప్పాలి.ముఖ్యంగా ఓటీటీలో రిలీజ్ అయిన తర్వాత హాలీవుడ్ ప్రేక్షకులను కూడా ఫిదా చేస్తూ అప్పుడే 5 వారాల నుండి ట్రెండింగ్లో కొనసాగుతుంది. హాలీవుడ్ ప్రముఖులు చిత్రం గురించి గొప్పగా చెబుతున్న సందర్భాలను మనం చూస్తూనే వస్తున్నాం. కొంతమంది ‘గే లవ్ స్టోరీ’ అంటూ విమర్శించే వాళ్ళు కూడా లేకపోలేదు.
ఇదిలా ఉండగా.. కొంతమంది ఇంటర్నేషనల్ చలనచిత్ర విశ్లేషకులు ఆస్కార్స్‌లో ఉత్తమ అంతర్జాతీయ చిత్రంగా ‘ఆర్.ఆర్.ఆర్’ కచ్చితంగా రన్నర్ గా నిలిచే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు. అంతేకాదు వారు ఆస్కార్ సభ్యులకు ఒక సలహా కూడా ఇచ్చారు. ఇండియాలో ఆస్కార్ అవార్డులకు సరైన ఎంపిక జరగడం లేదు. కనీసం ఉత్తమ అంతర్జాతీయ చలన చిత్రం అవార్డుకి అర్హతలు కలిగిన సినిమాను తప్పించడం అనేది సరైన పద్ధతి కాదు. ఆర్.ఆర్.ఆర్ ఆస్కార్ ను దక్కించుకోవడానికి అన్ని అర్హతలు కలిగి ఉంది’ అంటూ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
మరి భారత జ్యూరీ దీనిపై దృష్టి సారిస్తుందో లేదో చూడాలి. 95 ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సవం 2023 మార్చి లో జరగనుంది. అయితే 95 ఆస్కార్ అవార్డుల కొరకు ఎంపికయ్యే సినిమాలు ఇవే అంటూ అటు సినీ ప్రేక్షకులు, ఇంటర్నేషనల్ ఫిలిం విశ్లేషకులు అంచనాలు వేస్తున్నారు. మరి వారి ప్రెడిక్షన్స్ ప్రకారం ‘ఆస్కార్’ బరిలో ఉన్న సినిమాలు ఏంటో ఓ లుక్కేద్దాం రండి :