రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కి ఈ ఏడాది థియేటర్లలో విడుదలైన ఆర్ఆర్ఆర్ బాక్సాఫీస్ వద్ద సృష్టించిన సంచలనాలు అన్నీఇన్నీ కావు. చరణ్, ఎన్టీఆర్ లకు ఈ సినిమాతో పాన్ ఇండియా హీరోలుగా గుర్తింపు దక్కడంతో పాటు ఈ సినిమా సక్సెస్ తో దర్శకునిగా రాజమౌళి రేంజ్ ఊహించని స్థాయిలో పెరిగిందని తెలిసిందే. అయితే ఆర్ఆర్ఆర్ మూవీ ఆస్కార్ కు నామినేట్ అవుతుందా అనే చర్చ జరుగుతోంది. ఆర్ఆర్ఆర్ మూవీని హాలీవుడ్ సెలబ్రిటీలు సైతం ప్రశంసించారు.
జీ5, నెట్ ఫ్లిక్స్ ఓటీటీలలో ఈ సినిమా అందుబాటులో ఉండటంతో ఇప్పటివరకు ఈ సినిమాను చూడని వాళ్లు సైతం ఈ సినిమాను చూసి సినిమా గురించి గొప్పగా కామెంట్లు చేస్తున్నారు. పీరియాడికల్ ఫిక్షనల్ మూవీగా ఈ సినిమా తెరకెక్కడం గమనార్హం. రాజమౌళి 500 కోట్ల రూపాయల బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కించగా బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా క్రియేట్ చేసిన రికార్డులు అన్నీఇన్నీ కావు. ఎన్నో అరుదైన రికార్డులు ఈ సినిమా ఖాతాలో చేరాయనే సంగతి తెలిసిందే.
హాలీవుడ్ ప్రముఖ రచయితలతో ఒకరైన క్రిష్టఫర్ మిల్లర్, టీవీ రచయిత ఆమీ పౌలేట్ హార్ట్ మేన్ ఆర్ఆర్ఆర్ మూవీ గురించి గొప్పగా ప్రశంసించారు. రాజమౌళి టేకింగ్ కు సెలబ్రిటీలు ఫిదా అవుతున్నారు. మన దేశ ప్రేక్షకులు ఆర్ఆర్ఆర్ సినిమా కచ్చితంగా ఆస్కార్ కు నామినేట్ కావాలని కోరుకుంటున్నారు. అయితే ఈ సినిమా ఈ అరుదైన ఘనతను సొంతం చేసుకుంటుందో లేదో చూడాల్సి ఉంది.
ఆస్కార్ కు ఆర్ఆర్ఆర్ నామినేట్ అయితే మాత్రం చరణ్, ఎన్టీఆర్ అభిమానుల ఆనందానికి అవధులు ఉండవని చెప్పవచ్చు. ఆర్ఆర్ఆర్ విడుదలై దాదాపుగా మూడు నెలలు అవుతున్నా సోషల్ మీడియా వేదికగా ఈ సినిమా గురించి చర్చ జరుగుతుండటం గమనార్హం. ఈ సినిమా ఫుల్ రన్ లో ఏకంగా 1150 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.