ఆర్ఆర్ఆర్ మూవీ విడుదలై ఏడాది కాగా ఈ సినిమా సాధించిన రికార్డుల గురించి ఈ సినిమాకు వచ్చిన అవార్డుల గురించి కూడా చర్చ జరుగుతోంది. ఓటీటీలలో ఎక్కువమంది చూసిన సినిమాలలో ఈ సినిమా కూడా ఒకటి కావడం గమనార్హం. చోర్ నికలే కా బాగా సినిమా ఈ రేర్ రికార్డ్ ను సొంతం చేసుకుంది. ఆర్ఆర్ఆర్ రికార్డ్ కు ఈ సినిమా చెక్ పెట్టడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. ఓటీటీల క్రేజ్ పెరుగుతున్న తరుణంలో చిన్న సినిమా ఈ రేంజ్ లో సక్సెస్ కావడం గమనార్హం.
నెట్ ఫ్లిక్స్ లో చోర్ నికలే కా బాగా సినిమాకు 29 మిలియన్ అవర్స్ వ్యూస్ వచ్చాయి. ఆర్ఆర్ఆర్ సినిమాకు 25 మిలియన్ అవర్స్ వ్యూస్ వచ్చాయి. గంగూబాయి కతియావాడీ సినిమా విషయానికి వస్తే ఈ సినిమా ఏకంగా 22 మిలియన్ అవర్స్ వ్యూస్ ను సొంతం చేసుకోవడం గమనార్హం. నెట్ ఫ్లిక్స్ పాపులారిటీ ఉన్న సినిమాలను కొనుగోలు చేస్తూ వార్తల్లో నిలుస్తుండటం హాట్ టాపిక్ అవుతోంది.
భవిష్యత్తులో నంబర్ వన్ స్థానంలో నిలవడమే లక్ష్యంగా నెట్ ఫ్లిక్స్ అడుగులు పడుతున్నాయి. ఆర్ఆర్ఆర్ ను మించి వ్యూస్ సాధించడంతో చోర్ నికలే కా బాగా సినిమాకు రాబోయే రోజుల్లో వ్యూస్ మరింత పెరిగే అవకాశాలు అయితే ఉంటాయని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. చోర్ నికలే కా బాగా సినిమాలో కథ, కథనం అద్భుతంగా ఉండటం వల్లే ఈ అరుదైన రికార్డ్ సాధ్యమైంది.
అయితే రాబోయే రోజుల్లో రికార్డులు తారుమారు అవుతాయని ఆర్ఆర్ఆర్ (RRR) మూవీ మళ్లీ ఆ రికార్డ్ ను బ్రేక్ చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. రాజమౌళి తన రికార్డులను తానే బ్రేక్ చేస్తాడని చోర్ నికలే కా బాగా రికార్డ్ కూడా రాబోయే రోజుల్లో బ్రేక్ అయ్యే అవకాశం ఉందని కామెంట్లు వినిపిస్తున్నాయి.