RRR Trailer: ఆర్ఆర్ఆర్ ట్రైలర్.. అఫీషియల్ రిలీజ్ డేట్ వచ్చేసింది!

‘ఆర్ఆర్ఆర్’ సినిమా జనవరి 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. ఈసారైనా సినిమాను సమయానికి ప్రేక్షకుల ముందుకు వస్తుందా లేదా అనే కన్ఫ్యూజన్ మళ్ళీ మొదలైంది. కరోనా తీవ్రత పెరుగుతుండడంతో సినిమా వాయిదా పడే అవకాశం ఉన్నట్లు సోషల్ మీడియాలో గత కొన్ని రోజులుగా అనేక రకాల రూమర్స్ వస్తున్నాయి. మొదట ట్రైలర్ ను డిసెంబర్ 3న విడుదల చేయాలని అనుకున్నారు. ఇక సినిమా వాయిదా పడే అవకాశం ఉన్నందువల్ల ట్రైలర్ ను కూడా వాయిదా వేశారని కూడా అనుమానాలు వచ్చాయి.

అయితే ఈ విషయంలో పెరుగుతున్న అనుమానాలను ఫైనల్ గా క్లారిటీ ఇచ్చేశారు. సినిమా ట్రైలర్ ను డిసెంబర్ 9 న విడుదల చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ సభ్యులు అఫీషియల్ గా చెప్పేశారు. అందుకు సంబంధించిన పోస్టర్ ను కూడా సోషల్ మీడియాలో రిలీజ్ చేయగా వైరల్ గా మారింది. జూనియర్ ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో నటిస్తుండగా రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా కనిపించబోతున్న విషయం తెలిసిందే. తప్పకుండా ఈ సినిమా పాన్ ఇండియా రికార్డులను బ్రేక్ చేస్తుంది అని ఇప్పటికే ఒక క్లారిటీ వచ్చేసింది.

సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీ స్థాయిలో పెరిగిపోయింది. బాహుబలి అనంతరం దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన సినిమా కాబట్టి అన్ని భాషల్లోనూ అంచనాలు తార స్థాయికి చేరుకున్నాయి. మరి ప్రేక్షకుల అంచనాలను ఈ సినిమా ఏ స్థాయిలో అందుకుంటుందో చూడాలి.

అఖండ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘అఖండ’ మూవీ నుండీ గూజ్ బంప్స్ తెప్పించే 15 డైలాగ్స్..!
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి గురించి మనకు తెలియని విషయాలు..!
22 ఏళ్ళ రవితేజ ‘నీకోసం’ గురించి ఆసక్తికరమైన విషయాలు…!

Share.