చిరు, వెంకీ లతో సల్మాన్ ఖాన్ సందడి.. ఎక్కడ కలిశారు? ఎందుకు కలిశారు?

సల్మాన్ ఖాన్, చిరంజీవి, వెంకటేష్ లు కలిసి సందడి చేసిన లేటెస్ట్ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో నిన్నటి నుండీ తెగ వైరల్ అవుతుంది. ఈ ఫోటో వెనుక ఉన్న కథ ఏంటి? అనే చర్చలు కూడా సోషల్ మీడియాలో మొదలయాయ్యి. వివరాల్లోకి వెళ్తే… సల్మాన్ ఖాన్ ఎప్పుడు హైదరాబాద్ షూటింగ్ కి వచ్చినా చిరంజీవి,రామ్ చరణ్, వెంకటేష్, నాగార్జున వంటి వారిని కలిసే వెళ్తాడు. ప్రస్తుతం సల్మాన్ నటిస్తున్న ‘కబీ ఈద్‌ కబీ దివాలీ’ చిత్రం షూటింగ్‌ హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది.

ఈ షెడ్యూల్ లో పాల్గొన్న సల్మాన్‌ ఖాన్‌ పార్టీ అనంతరం తన స్నేహితులతో కలిసి జేసీ దివాకర్‌ రెడ్డి కుమారుడు జేసీ పవన్‌ రెడ్డి నివాసంలో పార్టీ చేసుకున్నారు. అందులో భాగంగానే చిరు, వెంకటేష్ లతో సల్మాన్ ఖాన్ ఈ ఫోటో దిగినట్టు స్పష్టమవుతుంది.ఇక పార్టీ ముగిసిన తర్వాత సల్మాన్ ఖాన్ ను చిరు తన నివాసానికి ఆహ్వానించినట్టు తెలుస్తోంది. రాంచరణ్ -సల్మాన్ ఖాన్ లు కూడా మంచి స్నేహితులు అన్న సంగతి తెలిసిందే.

‘జంజీర్’ ‘ఆర్.ఆర్.ఆర్’ సినిమాల ప్రమోషన్ల విషయంలో సల్మాన్ ఖాన్ సాయం తీసుకున్నాడు చరణ్. అంతేకాకుండా సల్మాన్ ఖాన్ ప్రస్తుతం చిరు, వెంకీ లతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. చిరంజీవి హీరోగా మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘గాడ్ ఫాదర్’ చిత్రంలో సల్మాన్ ఖాన్ అతిథి పాత్ర పోషిస్తున్నాడు. అలాగే ‘కబీ ఈద్‌ కబీ దివాలీ’ చిత్రంలో వెంకటేష్ కూడా నటిస్తున్నారు. ఈ మూవీలో వెంకీ హీరోయిన్ పూజా హెగ్డేకి అన్నయ్య పాత్రలో కనిపించబోతున్నారు.

విరాటపర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!

Share.