తెలుగులో విలన్ రోల్స్ లో ఎక్కువగా నటించడం ద్వారా సంపత్ రాజ్ పాపులారిటీని సంపాదించుకున్నారనే సంగతి తెలిసిందే. యూపీలోని లఖ్ నవూలో పుట్టిన సంపత్ రాజ్ నాన్నది నెల్లూరు అని నాన్న ఆర్మీలో పని చేయడం వల్ల వేర్వేరు ప్రాంతాలకు తరచూ బదిలీ జరిగేదని వెల్లడించారు. తాను ఆరు భాషలు మాట్లాడగలనని సంపత్ రాజ్ అన్నారు. తెలుగులో దమ్ము తన తొలి సినిమా అని ఆ తర్వాత పంజా, మిర్చి సినిమాలలో నటించానని ఆయన అన్నారు.
అయితే సంపత్ రాజ్ తొలి సినిమా దమ్ము అయినప్పటికీ ఆయన నటించి విడుదలైన తొలి సినిమా మాత్రం పంజా కావడం గమనార్హం. మిర్చి సినిమాలోని పాత్రకు ఊహించని స్థాయిలో పేరు వస్తుందని ఆ సినిమా రిలీజ్ కు ముందు ఊహించలేదని సంపత్ రాజ్ కామెంట్లు చేశారు. సినిమాల్లోకి రాకముందు తనకు అడ్వర్టైజింగ్ కంపెనీ ఉండేదని సంపత్ రాజ్ అన్నారు. కన్నడలో ఒక మూవీలో నటించే సమయంలో తనకు విడాకులు అయ్యాయని సంపత్ రాజ్ చెప్పుకొచ్చారు.
మా మ్యారేజ్ అరేంజ్డ్ మ్యారేజ్ అని విడాకులకు చిన్న వయస్సులోనే మ్యారేజ్ కావడం కారణమని సంపత్ రాజ్ అన్నారు. తనకు తన భార్యకు మద్య సఖ్యత లేకపోవడంతో విడాకులు తీసుకున్నామని సంపత్ రాజ్ వెల్లడించారు. చిన్న వయస్సులో మ్యారేజ్ చేసుకుంటే సమస్యలు వస్తాయని తన కూతురికి తాను ఇదే విషయాన్ని చెబుతానని సంపత్ రాజ్ కామెంట్లు చేశారు. విడాకుల తర్వాత కూతురు చాలా బాధ పడిందని సంపత్ రాజ్ అన్నారు.
తానే కూతురి బాధ్యతను తీసుకున్నానని సంపత్ రాజ్ వెల్లడించారు. సినిమాను తాను వర్క్ లా చూస్తానని పర్సనల్ లైఫ్ ను సినిమాలను కలపనని సంపత్ రాజ్ కామెంట్లు చేశారు. అవకాశాలు వచ్చేవరకు నటుడిగా కెరీర్ ను కొనసాగిస్తానని నటుడిని కాకపోతే ఏం అవుతానో అనే ఆలోచన ఎప్పుడూ లేదని సంపత్ రాజ్ వెల్లడించారు. హిందీ సినిమాలలో ఆఫర్లు వస్తున్నాయని అయితే మంచి రోల్ తో పరిచయం కావాలని తాను భావిస్తున్నానని సంపత్ రాజ్ అన్నారు.