సినీ పరిశ్రమలో వరుసగా వెడ్డింగ్ బెల్స్ మ్రోగుతున్నాయి.. కియారా అద్వానీ – సిద్దార్థ్ మల్హోత్రా.. హీరోయిన్ శివలీఖ ఒబెరాయ్ – ‘దృశ్యం’ (హిందీ) సిరీస్ చిత్రాల దర్శకుడు అభిషేక్ పాఠక్ వంటి వారు వివాహాలు చేసుకోగా.. నటి పూజా రామచంద్రన్ వంటి వారు సీమంతం పిక్స్ షేర్ చేసుకున్నారు.. షారుఖ్ ఖాన్ ‘చక్ దే ఇండియా’ లో నటించిన తాన్య అబ్రోల్.. తన ప్రియుడు ఆశిష వర్మను మ్యారేజ్ చేసుకుంది.. మరో ‘చక్ దే ఇండియా’ నటి చిత్రాశి రావత్..
తన బాయ్ ఫ్రెండ్, నటుడు ధ్రువ్ ఆదిత్యని వివాహ మాడింది. కన్నడ బ్లాక్ బస్టర్ ప్రొడ్యూసర్ అనూప్ గౌడ వెడ్డింగ్.. దీక్ష ఎస్ కుమార్ తో ఘనంగా జరిగింది. ఇప్పుడు కోలీవుడ్ హ్యాట్రిక్ డైరెక్టర్ పి.ఎస్.మిత్రన్ కూడా ఓ ఇంటివాడయ్యాడు. ఫిలిం జర్నలిస్ట్, రైటర్ ఆషామీరా అయ్యప్పన్ ను వివాహం చేసుకున్నాడు. విశాల్‌తో ‘ఇరుంబి తిరై’ (అభిమన్యుడు), శివ కార్తికేయన్ ‘హీరో’, కార్తితో ‘సర్దార్’ చిత్రాలతో హ్యాట్రిక్ హిట్స్ అందుకున్నాడు మిత్రన్..
ఫిలిం జర్నలిస్టు ఆషామీరాతో పరిచయం ప్రేమగా మారడంతో ఏడడుగులు వేశారని కోలీవుడ్ మీడియా సమాచారం. ఈ సందర్భంగా కొత్త జంటకు తమిళ పరిశ్రమకు చెందిన సినీ, జర్నలిస్టులు విషెస్ తెలియజేస్తున్నారు. కార్తి వివాహానికి వచ్చి వధూవరులను విష్ చేశాడు..