Sarkaru Vaari Paata Collections: డీసెంట్ అనిపిస్తుంది కానీ స్ట్రాంగ్ గా కలెక్ట్ చేయడం లేదు..!

మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన ‘సర్కారు వారి పాట’ చిత్రం మే 12న విడుదలై విజయవంతంగా 2 వారాలు పూర్తిచేసుకుని 3 వ వారంలోకి ఎంట్రీ ఇచ్చింది. పరశురామ్(బుజ్జి) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ‘మైత్రి మూవీ మేకర్స్’, ’14 రీల్స్ ప్లస్’, ‘జి.ఎం.బి ఎంటర్టైన్మెంట్’ సంస్థలు కలిసి నిర్మించాయి.మొదటి షోతోనే మిక్స్డ్ టాక్ ను ముటకట్టుకున్నప్పటికీ కలెక్షన్ల పరంగా మాత్రం ఈ మూవీ పర్వాలేదు అనిపిస్తుంది. అయితే ‘ఎఫ్3’ రిలీజ్ అవ్వడంతో ఈ మూవీ కలెక్షన్ల పై ఎఫెక్ట్ పడింది.

బ్రేక్ ఈవెన్ కు ఈ మూవీ ఇంకా పెద్ద టార్గెట్ నే ఛేజ్ చేయాల్సి ఉంది.ఒకసారి ‘సర్కారు వారి పాట’ 17 డేస్ కలెక్షన్స్ ను గమనిస్తే :

నైజాం 34.36 cr
సీడెడ్ 11.85 cr
ఉత్తరాంధ్ర 12.21 cr
ఈస్ట్  8.79 cr
వెస్ట్  5.55 cr
గుంటూరు  8.54 cr
కృష్ణా  6.21 cr
నెల్లూరు  3.62 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 91.13 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా   6.75 cr
ఓవర్సీస్  12.43 cr
వరల్డ్ వైడ్ (టోటల్) 110.31 cr

‘సర్కారు వారి పాట’ చిత్రానికి రూ.120 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ సాధించాలి అంటే రూ.121 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి. 17 రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రం రూ.110.31 కోట్ల షేర్ ను రాబట్టింది. నెగిటివ్ టాక్ తో ఇలా కలెక్ట్ చేయడం అంటే చిన్న విషయం కాదు. కానీ బ్రేక్ ఈవెన్ కు ఈ మూవీ ఇంకా రూ.10.69 కోట్ల షేర్ ను రాబట్టాలి. నిన్న ‘ఎఫ్3’ మూవీ రిలీజ్ అవ్వడంతో ‘సర్కారు వారి పాట’ కలెక్షన్ల పై గట్టి ఎఫెక్ట్ పడింది.

ఎఫ్ 3 సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

పెళ్లొద్దు.. సినిమాలే ముద్దు… అంటున్న 12 మంది నటీనటులు వీరే..!
తమ సొంత పేర్లనే సినిమాల్లో పాత్రలకి పెట్టుకున్న హీరోల లిస్ట్..!
ఈ 11 హీరోయిన్ల కాంబోలు అనేక సినిమాల్లో రిపీట్ అయ్యాయి..!

Share.