‘ఇంద్ర’ తో ఇండస్ట్రీ హిట్, ‘ఠాగూర్’ తో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్న మెగాస్టార్ చిరంజీవికి 2004లో విడుదలైన ‘అంజి’ చిత్రం పెద్ద షాకిచ్చింది. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఘోరంగా నిరాశపరిచింది. దీంతో మెగా ఫ్యాన్స్ బాగా హర్ట్ అయ్యారు. అయితే అదే ఏడాది అక్టోబర్ లో వచ్చిన ‘శంకర్ దాదా ఎం.బి.బి.ఎస్’ చిత్రం సూపర్ హిట్ అయ్యి.. వెంటనే మెగా అభిమానులకు రిలీఫ్ ఇచ్చింది అని చెప్పాలి.
జయంత్ సి పరాన్జీ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీని ‘జెమిని ఫిల్మ్ సర్క్యూట్’ బ్యానర్ పై అక్కినేని రవిశంకర్ ప్రసాద్ నిర్మించారు.బాలీవుడ్లో సూపర్ హిట్ అయిన ‘మున్నాభాయ్ ఎం.బి.బి.ఎస్ కు రీమేక్ గా తెరకెక్కింది ఈ చిత్రం. 2004 వ సంవత్సరం అక్టోబర్ 15న ఈ మూవీ రిలీజ్ అయ్యింది. నేటితో ఈ చిత్రం విడుదలై 18 ఏళ్ళు పూర్తి కావస్తోంది. అందుకే ‘#18YearsForShankarDadaMBBS’ అనే హ్యాష్ ట్యాగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. ఈ నేపథ్యంలో బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ ఎంత కలెక్ట్ చేసిందో ఓ లుక్కేద్దాం రండి :
నైజాం
8.55 cr
సీడెడ్
5.00 cr
ఉత్తరాంధ్ర
2.76 cr
ఈస్ట్
2.04 cr
వెస్ట్
1.68 cr
గుంటూరు
2.02 cr
కృష్ణా
1.85 cr
నెల్లూరు
1.18 cr
ఏపీ + తెలంగాణ (టోటల్)
25.08 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా +
ఓవర్సీస్
2.18 cr
వరల్డ్ వైడ్ (టోటల్)
27.26 cr (షేర్)
‘శంకర్ దాదా ఎం.బి.బి.ఎస్’ చిత్రం రూ.20 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది. ఫుల్ రన్ ముగిసేసరికి ఈ చిత్రం రూ.27.26 కోట్ల షేర్ ను కలెక్ట్ చేసింది. అంటే బయ్యర్లకు రూ.7.26 కోట్ల లాభాలను అందించింది. కమర్షియల్ గా ఈ మూవీ సూపర్ హిట్ అనిపించుకుంది.