నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన ‘టక్ జగదీష్’ సినిమా వినాయకచవితి సందర్భంగా ఓటీటీలో విడుదలైన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందన వస్తోంది. ఇదిలా ఉంటే సినిమాలో కొన్ని అంశాలపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ నడుస్తోంది. దర్శకుడు శివ నిర్వాణ కొన్ని లాజిక్స్ మిస్ చేశాడని విమర్శిస్తున్నారు. సినిమాలో అంత పెద్ద ఫ్యామిలీను చూపించిన దర్శకుడు వారి మధ్య వరసలను సరిగ్గా చూపించలేదంటూ కామెంట్స్ చేస్తున్నారు.
అలానే నాని పెర్ఫార్మన్స్ కి కూడా పేరు పెడుతున్నారు. తాజాగా ఈ ట్రోలింగ్ పై దర్శకుడు శివ నిర్వాణ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ‘టక్ జగదీష్’ సినిమాలో ఓ సన్నివేశాన్ని షేర్ చేస్తూ.. జనాలు రకరకాలుగా మాట్లాడుకుంటారని.. ప్రేమ, ద్వేషం, పాజిటివిటీ, నెగెటివిటీ ఇలా అన్నింటినీ స్ప్రెడ్ చేస్తుంటారని.. వారిని నవ్వుతో ధైర్యంగా, నిజాయితీగా తీసుకోగలగాలని దానికి నేను సిద్ధంగా ఉన్నానంటూ పేర్కొన్నారు. శివ నిర్వాణ చేసిన ఈ ట్వీట్ ను నాని ఫ్యాన్స్ షేర్ చేస్తూ వారి మద్దతుని తెలియజేస్తున్నారు.
కొందరు నెటిజన్లు మాత్రం సినిమాలో దర్శకుడు చేసిన తప్పులను ఎత్తిచూపిస్తున్నారు. గతంలో ఈ డైరెక్టర్ రూపొందించిన ‘నిన్ను కోరి’, ‘మజిలీ’ సినిమాలు భారీ విజయాలను అందుకున్నాయి. దీంతో ‘టక్ జగదీష్’ సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. కానీ ఆ అంచనాలను సినిమా అందుకోలేకపోయింది.