కన్నడనాట పెద్ద సినిమాలకే ఓటీటీలు బ్రహ్మరథం పడుతున్నాయి, చిన్న సినిమాల్ని పట్టించుకోవడం లేదు అంటూ ఈ మధ్య కొన్ని చర్చలు జరుగుతున్నాయి. అనుకున్నట్లుగానే శాండిల్ వుడ్‌లో మరో పెద్ద సినిమా అనౌన్స్ అయింది. దానికి భారీ స్పందన వస్తోంది కూడా. కరుణాడ చక్రవర్తి అని అభిమానులు ముద్దుగా పిలుచుకునే శివరాజ్ కుమార్ (ShivaRajkumar) కొత్త సినిమా గురించే ఇదంతా. శివరాజ్ కుమార్ కొత్త సినిమా ‘భైరవన కోనే పాఠ’ ఫస్ట్‌లుక్‌ను రిలీజ్ చేశారు.
ఈ సినిమాను రక్షిత్ శెట్టి (Rakshit Shetty) – రుక్మిణీ వసంత్ (Rukmini Vasanth) , చైత్ర జె ఆచార్ హీరోయిన్లుగా వచ్చిన ‘సప్త సాగరాలు దాటి’ (Sapta Sagaralu Dhaati) దర్శకుడు తెరకెక్కించారు. ఆ సినిమాలతో దర్శకుడిగా అదిరిపోయే విజయాలు అందుకున్న హేమంత్.ఎం.రావు (Hemanth M. Rao) ఈ సినిమాకు అదిరిపోయేలా తెరకెక్కించారని లుక్‌లు చూస్తే అర్థమవుతోంది. ఈ సినిమాలో భైరవగా శివరాజ్ కుమార్ కనిపిస్తాడు. ‘భైరవన కోనే పాఠ’ సినిమా ఫస్ట్ లుక్‌లో శివరాజ్ కుమార్ సాల్ట్ & పెప్పర్ లుక్కులో కనిపించాడు.
పురాతన కాలంలో ఉన్నట్టు కాస్ట్యూమ్స్ ఉన్నాయి. అయితే ఇది చరిత్ర నుండి తీసిన సినిమా కాదు అని నిర్మాతలు అంటున్నారు. అయితే 12వ శతాబ్దంలో ఈ సినిమా కొంత భాగం సాగుతుంది అని చెబుతున్నారు. సినిమా మొదలయ్యాక క్లారిటీ రావొచ్చు. ‘భైరవన కోనే పాఠ’ సినిమాను డాక్టర్ వైశాఖ్ కె గౌడ నిర్మిస్తున్నారు. ప్రజెంట్ ట్రెండ్‌కి తగ్గట్టు కన్నడతో పాటు తెలుగు, తమిళ, మలయాళ, హిందీలో విడుదల చేస్తారట. అయితే ప్రస్తుతం శివరాజ్ కుమార్ రెండు సినిమాలతో బిజీగా ఉన్నారు.
‘మఫ్తీ’ ప్రీక్వెల్ ‘భైరాతి రానగల్’ ఒక సినిమా కాగా, మరో సినిమా ‘ఉత్తరాకాండ’. ఈ రెండూ అయ్యాకనే ‘భైరవన కోనే పాఠ’ సెట్స్ మీదకు వెళ్తుందని సమాచారం. మరోవైపు శివరాజ్ కుమార్ కొన్ని ఇతర భాషల సినిమాలు కూడా ఓకే చెప్పారు. ఈ నేపథ్యంలో ‘భైరవ కోనే పాఠ’ ఎప్పుడు మొదలవుతుంది అనేది ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే సినిమా లుక్ అంత బాగుంది.