తెలుగమ్మాయిలకు తెలుగులో తప్ప అన్నిచోట్ల మంచి అవకాశాలు, విజయాలు వరిస్తుంటాయి అనేది ఇండస్ట్రీలో బాగా పాపులర్ అయిన నానుడి. శ్రీదేవి మొదలుకొని టీనా శ్రావ్య వరకు అందరూ తెలుగులో కంటే బయటే ఎక్కువ ఆఫర్లు అందుకున్నారు. ఆ లిస్ట్ లో కొత్తగా చేరిన పేరు రాజశేఖర్ చిన్న కుమార్తె శివాత్మిక. తెలుగులో “దొరసాని” చిత్రంతో డెబ్యూ ఇచ్చిన శివాత్మిక.. అనంతరం తమిళ ఇండస్ట్రీలో వరుస అవకాశాలు అందిపుచ్చుకుంది. ముఖ్యంగా “ఆకాశం” సినిమాతో మంచి నటిగా పేరు తెచ్చుకుంది.
Shivathmika
ఆ తర్వాత తెలుగులో “రంగమార్తాండ, పంచతంత్రం” సినిమాల్లో నటించినప్పటికీ.. ఎందుకో కమర్షియల్ సక్సెస్ మాత్రం అందుకోలేకపోయింది. దాంతో ఆమెను తెలుగునాట పట్టించుకోవడం మానేశారు. అయితే.. తమిళంలో మాత్రం అప్పుడప్పుడు సినిమాలు చేస్తూ కెరీర్ ను చాలా జాగ్రత్తగా బిల్డ్ చేసుకుంటుంది.
రీసెంట్ గా శివాత్మిక హీరోయిన్ గా నటించిన తమిళ చిత్రం “ఆరోమలే” నవంబర్ 7న విడుదలై మంచి టాక్ తో హిట్ స్టేటస్ సాధించింది. ఇంచుమించిగా బ్రేకీవెన్ కూడా అయిపోయింది. అన్నిటికీ మించి శివాత్మిక లుక్స్ & యాక్టింగ్ కి యూత్ ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యి, ఆమెను క్రష్ లిస్ట్ లో యాడ్ చేసారు. అందువల్ల ఇప్పుడు ఆమెకు తమిళంలో ఎంక్వైరీలు పెరిగాయి. అయితే.. ఆమెకు తమిళనాట అవకాశాలు వస్తున్నా.. తెలుగులో ఎవరూ పట్టించుకోకపోవడం అనేది మైనస్. మన తెలుగు దర్శకనిర్మాతలు ఆమెను ఎప్పుడు గుర్తిస్తారో మరి.
ఇకపోతే.. శివాత్మిక అక్క శివానికి మాత్రం తెలుగులో కాదు తమిళంలోనూ సరైన ఆఫర్లు రావడం లేదు. చేసిన సినిమాలు కూడా సరిగా రిలీజ్ అవ్వడం లేదు. మరి ఈ ఇద్దరిలో ఎవరు స్టార్ హీరోయిన్ అవుతారు? అనేది చూడాలి. ఈ ఇద్దరిలో ఎవరు స్టార్ హీరోయిన్ గా స్థిరపడినా రాజశేఖర్-జీవిత దంపతులు సంతృప్తి చెందడం ఖాయం. కాకపోతే.. ఇద్దరూ స్టార్ హీరోయిన్లు అయితే మాత్రం వాళ్ల ఆనందానికి అవధులు ఉండవు.