ప్రభాస్ (Prabhas) నాగ్ అశ్విన్ (Nag Ashwin) కాంబో మూవీ కల్కి 2898 ఏడీ (Kalki 2898 AD) పై భారీ స్థాయిలో అంచనాలు నెలకొనగా ఈ సినిమాలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ప్రభాస్ ఈ సినిమాలో ఏకంగా 6 పాత్రల్లో కనిపిస్తారని వైరల్ అవుతున్న వార్తల సారాంశం. ఈ సినిమాకు ఒక స్టార్ హీరో వాయిస్ ఓవర్ ఇస్తారని కూడా సోషల్ మీడియా వేదికగా వినిపిస్తుండగా ఆ వార్తల్లో నిజానిజాలు తెలియాల్సి ఉంది. ప్రభాస్ ఈ సినిమాలో నిజంగా ఆరు పాత్రల్లో కనిపిస్తే మాత్రం ప్రభాస్ అభిమానులకు బిగ్గెస్ట్ సర్ప్రైజ్ అవుతుందని చెప్పవచ్చు.
కల్కి 2898 ఏడీ సినిమాలో బుజ్జి పాత్రకు సంబంధించి కూడా షాకింగ్ అప్ డేట్స్ రివీల్ అవుతున్నాయి. ఈ కారు బరువు మొత్తం ఏకంగా 6 టన్నులు అని భోగట్టా. ఈ కారు తయారీకి దాదాపుగా 7 కోట్ల రూపాయలు ఖర్చు అయిందని సమాచారం అందుతోంది. ఆనంద్ మహీంద్రా తాజాగా ట్విట్టర్ వేదికగా ఈ సినిమా దర్శకుడు నాగ్ అశ్విన్ పై ప్రశంసల వర్షం కురిపించారు. నాగ్ అశ్విన్, అతని టీమ్ గొప్పగా ఆలోచించడానికి భయపడరని వారిని చూస్తుంటే గర్వంగా ఉంటుందని అన్నారు.
అధునాతన వాహనాలు తయారు చేయడంలో కల్కి టీమ్ కు మహీంద్రా రీసెర్చ్ వ్యాలీ బృందం సహాయపడిందని ఆనంద్ మహీంద్రా పేర్కొన్నారు. బుజ్జి వాహనం రెండు మహీంద్రా ఇ మోటార్లతో నడుస్తుందని ఆయన చెప్పుకొచ్చారు. కల్కి సినిమా కోసం అడ్వాన్స్డ్ టెక్నాలజీని వినియోగించారని తెలుస్తోంది.
కమల్ (Kamal Haasan) , అమితాబ్ (Amitabh Bachchan) , దిశా పటానీ (Disha Patani), దీపికా పదుకొణే (Deepika Padukone) ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కల్కి ట్రైలర్ విడుదలైతే మాత్రం ఈ సినిమా ఎలా ఉండబోతుందో పూర్తిస్థాయిలో క్లారిటీ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. కల్కి సినిమా రిలీజ్ కు నెలరోజుల సమయం ఉన్న నేపథ్యంలో రిలీజ్ సమయానికి ఈ సినిమాపై అంచనాలు మరింత పెరుగుతాయేమో చూడాల్సి ఉంది.