మాస్ మహారాజ్ రవితేజ నుండి ఈ ఏడాది ‘వాల్తేరు వీరయ్య’ ‘రావణాసుర’ వంటి సినిమాలు వచ్చాయి. అందులో ‘వాల్తేరు వీరయ్య’ పెద్ద హిట్టు. కానీ అది చిరంజీవి సినిమా కాబట్టి.. రవితేజకి అంతంత మాత్రమే క్రెడిట్ దక్కింది. ఇక ‘రావణాసుర’ ప్లాప్ అయ్యింది. అయినప్పటికీ రవితేజ మార్కెట్ ఏమాత్రం దెబ్బ తినలేదు. అందుకు ‘టైగర్ నాగేశ్వరరావు’ సినిమాని పెద్ద ఉదాహరణగా చెప్పుకోవచ్చు. దేశాన్ని గజగజలాడించిన స్టూవర్టుపురం దొంగ అయిన నాగేశ్వరరావు జీవిత కథతో ఈ సినిమా రూపొందింది.
రవితేజ నటించిన మొదటి పాన్ ఇండియా మూవీ ఇది. అలాగే ‘కార్తికేయ 2’ ‘ది కశ్మీర్ ఫైల్స్’ వంటి పాన్ ఇండియా హిట్లు కొట్టిన అభిషేక్ అగర్వాల్ ఈ చిత్రానికి నిర్మాత.వంశీ ఈ చిత్రానికి దర్శకుడు.టీజర్, ట్రైలర్ కి కూడా పాజిటివ్ రెస్పాన్స్ లభించింది. అందుకే ‘టైగర్ నాగేశ్వరరావు’ పై మంచి అంచనాలే ఏర్పడ్డాయి. అంతేకాదు ఈ హైప్ వల్ల సినిమాకి థియేట్రికల్ బిజినెస్ బాగా జరిగింది.
రవితేజ గత సినిమాల ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు గమనిస్తే..
1) టైగర్ నాగేశ్వరరావు : 36 కోట్లు
2) రావణాసుర : 18.9 కోట్లు
3) ధమాకా : 20.45 కోట్లు
4) రామారావు ఆన్ డ్యూటీ : 17.72 కోట్లు
5) ఖిలాడి : 22.3 కోట్లు
6) క్రాక్ : 14.2 కోట్లు
7) డిస్కో రాజా : 22 కోట్లు
సో.. ఇది ‘టైగర్ నాగేశ్వరరావు’ చిత్రం రవితేజ కెరీర్లోనే అత్యధిక థియేట్రికల్ బిజినెస్ చేసింది. మరి ఈ చిత్రం బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉంటుందో చూడాలి