Akhanda: అఖండ రిలీజ్ విషయంలో షాకింగ్ ట్విస్ట్?

కొన్ని నెలల క్రితం ఒక ఇంటర్వ్యూలో బాలకృష్ణ మాట్లాడుతూ అఖండ సినిమాను అక్టోబర్ లో రిలీజ్ చేస్తామని చెప్పుకొచ్చారు. బాలకృష్ణ ఫ్యాన్స్ సైతం అఖండ దసరాకు రిలీజవుతుందని భావించారు. అయితే దసరాకు ఈ సినిమా రిలీజ్ కాలేదు. తాజాగా ఈ సినిమా షూటింగ్ పూర్తి కాగా బాలయ్య అభిమానులు దీపావళికి అఖండ కచ్చితంగా రిలీజవుతుందని నమ్మారు. అయితే బాలయ్య అభిమానులకు మరోసారి నిరాశ తప్పదని తెలుస్తోంది. సింహా, లెజెండ్ బ్లాక్ బస్టర్స్ తర్వాత బాలయ్య బోయపాటి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా అంచనాలను మించి సక్సెస్ సాధిస్తుందని బాలయ్య ఫ్యాన్స్ భావిస్తున్నారు.

దసరా రోజు ఈ సినిమా రిలీజ్ డేట్ కు సంబంధించి అప్ డేట్ వస్తుందని ఫ్యాన్స్ భావించగా ఎలాంటి అప్ డేట్ రాలేదు. బాలయ్య ఫ్యాన్స్ ద్వారకా క్రియేషన్స్ ను అఖండ సినిమాకు సంబంధించిన అప్ డేట్ ఇవ్వలేదని ట్రోల్ చేస్తున్నారు. దీపావళికి కూడా అఖండ రిలీజ్ కావడం కష్టమేనని సమాచారం. డిసెంబర్ తొలి వారంలో ఈ సినిమా రిలీజయ్యే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. అఖండ్ నైజాం, సీడెడ్ హక్కులు భారీ మొత్తానికి అమ్ముడయ్యాయని సమాచారం.

బాలయ్య గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో ఒక సినిమాకు అనిల్ రావిపూడి డైరెక్షన్ లో ఒక సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా త్వరలో ఈ రెండు సినిమాల షూటింగ్ లు మొదలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. బాలయ్య హీరోగా తెరకెక్కుతున్న సినిమాలన్నీ భారీ బడ్జెట్ సినిమాలే కావడం గమనార్హం.

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

మహా సముద్రం సినిమా రివ్యూ & రేటింగ్!
ఒక్కో సినిమాకు ఈ స్టార్ హీరోలు ఎంతెంత డిమాండ్ చేస్తున్నారో తెలుసా?
టాలీవుడ్ లో బి.టెక్ చదువుకున్న 10 మంది లిస్ట్..!

Share.