సోషల్ మీడియా యుగంలో మాట నోరు జారడం ఆలస్యం… మన మీద పడటానికి రాళ్లు ఉంటాయి. సెలబ్రిటీల విషయంలో అయితే ఇది ఇంకానూ. ఎప్పుడు తప్పు మాట్లాడతారా అని ఎదురు చూస్తూ ఉంటారు. అలా వెయిట్ చేస్తున్నవాళ్లకు కావాల్సినంత ఫుటేజ్ ఇచ్చి… ఇప్పుడు లాక్కోలేక పీక్కోలేక ఇబ్బంది పడుతోంది శ్వేత తివారీ. ఈమె తెలుగు ప్రేక్షకులకు పెద్ద పరిచయం లేకపోవచ్చు కానీ… హిందీ సీరియళ్లను ఫాలో అయ్యే వాళ్లకు మాత్రం బాగా తెలుసు. సినిమాల్లో కూడా నటించింది.
ఈ 41 ఏళ్ల హాట్ యాక్ట్రెస్ ప్రస్తుతం ‘షో స్టాపర్’ అనే వెబ్ సిరీస్‌లో నటించింది. ప్రస్తుతం దాని ప్రచార కార్యక్రమాల్లో బిజీగా గడుపుతోంది. అలా ఓ ప్రెస్‌మీట్‌లో పాల్గొన్నప్పుడు చేసిన కార్యక్రమం ఇప్పుడు ఆమెకు ఇబ్బందులు తెచ్చిపెట్టింది. ఏకంగా ఆమె మీద కేసు నమోదయ్యే పరిస్థితి వచ్చింది. షో స్టాపర్ సిరీస్‌లో టీవీ నటుడు సౌరభ్ జైన్ కూడా నటిస్తున్నాడు. ఆయన ఓ టీవీ సీరియల్‌లో శ్రీకృష్ణుడిలా కనిపించిన విషయం తెలిసిందే.
ఈ రెండు అంశాలను కలుపుకొని శ్వేత చేసిన కామెంట్ ఇప్పుడు ఇబ్బందులు తెచ్చిపెట్టింది. బోపాల్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో శ్వేత సరదాగా మాట్లాడుతూ.. తన లోదుస్తులకు, దేవుడికి ముడిపెడుతూ వ్యాఖ్యలు చేసింది. దీంతో శ్వేత వ్యాఖ్యలు హిందూ దేవుళ్లను కించపరిచేలా ఉన్నాయంటూ నెటిజన్ల నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ వ్యవహారంపై మధ్యప్రదేశ్ హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటనపై విచారణ జరిపి 24 గంటల్లోగా నివేదిక అందజేయాలని భోపాల్ పోలీస్ కమిషనర్‌ను ఆదేశించారు.
మరోవైపు బోపాల్‌లో సోనూ ప్రజాపతి అనే వ్యక్తి శ్వేత మీద కేసు పెట్టారు. ఓ వర్గం మనోభావాలు దెబ్బతినేలా ఆమె వ్యాఖ్యలు చేశారంటూ ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో ఆమె మీద ఐపీసీ 295(ఎ) సెక్షన్ కింద కేసు రిజిస్టర్ చేశారు. దీనిపై ఆమెకు సమన్లు పంపించనున్నారు. ఆమె చేసిన నేరం నాన్‌బెయిలబుల్ న్యాయవాదులు అంటున్నారు. ఈ కేసు విషయంలో ఆరోపణలు రుజువైతే ఆమెకు ఏడేళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉందట.
ఈ వెబ్ సిరీస్‌లో సౌరబ్ జైన్ ‘బ్రా’ ఫిట్టర్ పాత్ర పోషిస్తున్నాడు. దాంతో అతని పాత సినిమాలో పాత్రను ఉద్దేశిస్తూ… దేవుడు (సౌరబ్) నా బ్రా సైజు కొలుస్తున్నాడు అని జోక్ చేసింది. ఆ వీడియో వైరల్ కావడంతో శ్వేత ఇబ్బందుల్లో పడింది. ఇప్పుడు పోలీసుల వరకు వెళ్లింది. రేపొద్దున కోర్టు మెట్లు ఎక్కాల్సి రావొచ్చు.
एक्ट्रेस #ShwetaTiwari का भोपाल में दिया गया बयान निंदनीय है।
भोपाल पुलिस कमिश्नर मकरंद देउस्कर को 24 घंटे में तथ्यों और संदर्भ की जांचकर रिपोर्ट देने का निर्देश दिया है, जिसके आधार पर निर्णय लिया जाएगा।@DGP_MPpic.twitter.com/76IzK9lqDt