మాస్ మహారాజ్ రవితేజ నుండి రాబోతున్న మొదటి పాన్ ఇండియా మూవీ ‘టైగర్ నాగేశ్వరరావు’. వంశీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని అభిషేక్ అగర్వాల్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. స్టూవర్టుపురంకి చెందిన పెద్ద గజదొంగ అయిన ‘టైగర్ నాగేశ్వరరావు’ జీవిత కథగా ఈ మూవీ రూపొందుతుంది. గ్లింప్స్ ప్రోమోస్ చాలా ప్రామిసింగ్ గా ఉన్నాయి. కచ్చితంగా ఇది రవితేజ కెరీర్లో ఓ మంచి సినిమా అవుతుంది అనే భరోసాని ఇచ్చాయి.
రవితేజ కూడా ఈ సినిమా గురించి ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఉన్నాడు. ఇప్పటివరకు రవితేజ తీసిన సినిమాల గురించి స్టేజిపై ఎక్కువ సేపు మాట్లాడింది లేదు. ‘సినిమానే మాట్లాడాలి’ అనే పాలసీ అతనిది. అయితే తనకు సంతృప్తి, కాన్ఫిడెన్స్ అలాగే ఓ గర్వంతో కూడిన ఫీలింగ్ ఏ సినిమాలోనైనా నటిస్తున్నప్పుడు కలిగితే ఆ సినిమా గురించి గట్టిగా మాట్లాడతాను అంటూ రవితేజ ఓ సందర్భాల్లో చెప్పుకొచ్చారు. దసరా కానుకగా అక్టోబర్ 20 న ఈ చిత్రం విడుదల కాబోతోందని మేకర్స్ ఎప్పుడో ప్రకటించారు.
ఇది పక్కన పెడితే.. ఈ చిత్రానికి అలాగే నాని హీరోగా నటించిన ‘శ్యామ్ సింగ రాయ్’ కి సిమిలారిటీస్ ఉంటాయని ఇన్సైడ్ టాక్ వినిపించింది. ఇటీవల రిలీజ్ అయిన ఫస్ట్ సింగిల్ తో అది నిజమే అనే క్లారిటీ అందరికీ వచ్చేసింది. ‘శ్యామ్ సింగ రాయ్’ లో 30 ఏళ్ల తర్వాత హీరో జన్మించినట్టు చూపించారు.
‘టైగర్ నాగేశ్వరరావు’ (Tiger Nageswara Rao) సినిమాలో కూడా కొంచెం అలాగే ఉంటుందట. కాకపోతే ‘టైగర్ నాగేశ్వరరావు’ మనవడిగా మళ్ళీ అతనే జన్మించినట్టు చూపిస్తారని సమాచారం.’టైగర్ నాగేశ్వరరావు’ కి ఉన్న నేర చరిత్ర వల్ల అతని మనవడికి ఎలాంటి సమస్యలు తలెత్తాయి అనేది ఈ సినిమా కథగా తెలుస్తుంది.