భారతీయులందరూ బాహుబలిని మా సినిమా అని గర్వపడేలా చేశారు రాజమౌళి. బాహుబలి బిగినింగ్ తో రెండో పార్ట్ పై అంచనాలు పెంచిన జక్కన ట్రైలర్ తో హార్ట్ బీట్ ని పెంచారు. సినిమాని ఎప్పుడు చూద్దామా? అనే ఆరాటాన్ని కలిగించారు. ఈ ట్రైలర్ బట్టి కొంత వరకు కథని గెస్ చేయగలుగుతున్నాము కానీ కరక్ట్ గా అదే అయి ఉంటుందని నమ్మకంగా చెప్పలేక పోతున్నాం. పాటలను వింటే, అందులోని సాహిత్యాన్ని గమనిస్తే కథ ఎలా సాగుతుంది అనే విషయం స్పష్టం గా అర్ధమవుతోంది. మేము అనుకున్న సన్నివేశాలను మీకు చెబుతున్నాం. ఇంకా సినిమా మూడు రోజుల్లో రిలీజ్ కానుంది కాబట్టి.. అప్పటి లోపున ఈ ఫోకస్ చదివి.. మీ అభిప్రాయం చెప్పండి.
1) దండాలయ్యా దండాలయ్యా …ఈ పాటను వినేటప్పుడు మనకు రెండు సందర్భాలు ఉన్నట్టు అనిపిస్తాయి. ఒకటి ఆనందకరమైనది, మరొకటి బాధ కలిగించేది. ఈ రెండింటిని కలిపి మనకి ఒక సాంగ్ గా కీరవాణి ఇచ్చారు. ముందుగా చివర నాలుగు లైన్లను గురించి మాట్లాడుకుందాం.
“తమనేలే రాజుని మోసే భాగ్యం కలిగిందనుకుంటూ, ఈ బండల గుండెలు పొంగి పండగ అయిపోదా తను చిందించే చెమటను తడిసే పుణ్యం దొరికిoదనుకుంటూ, పులకించిన ఈ నేలంతా పచ్చగ అయిపోదా. నీమాటే మా మాటయ్యా, నీ చూపే శాసనమయ్యా, మా రాజు నువ్వే, తండ్రి నువ్వే, కొడుకూ నువ్వే, మా ఆయువు కూడా నీదయ్యా. దండాలయ్యా దండాలయ్యా మారాజై నువ్వుండాలయ్యా దండాలయ్యా దండాలయ్యా మారాజై నువ్వుండాలయ్యా.”
సాహిత్యాన్ని బట్టి ఈ చివరి బిట్ ప్రజలు ఆనందపడుతున్న క్షణాలప్పుడు వచ్చేది. అది బాహుబలి మాహిష్మతి రాజ్యానికి వచినప్పుడా? లేకుంటే కుంతల రాజ్యానికి వచినప్పుడా ? అనేది కొంచెం సస్పెన్స్. ఇక ఈ పాట మొదట్లో వచ్చే సాహిత్యాన్ని గమనిస్తే..
ఈ లైన్లు వినేటప్పుడు చలించని హృదయం అంటూ ఉండదు. అంతలా సంగీతాన్నిచ్చారు కీరవాణి. ఈ పాట రెండు సందర్భాల్లో వచ్చేందుకు వీలుంది. అమరేంద్ర బాహుబలి మాహిష్మతి రాజ్యాన్ని వదిలి వెళ్ళిపోయినప్పుడు.. లేదా మరణించినప్పుడు. పాటల ద్వారా కథ రివీల్ కాకుండా చేసిన రాజమౌళి తెలివితేటలను మెచ్చుకోకుండా ఉండలేము.
2) కన్నానిదురించారాకుంతల రాజ్యం లో అనుష్క పాడుకునే పాట “కన్నానిదురించారా”. మీకు ఈ పాట సందర్భం తెలుసుకోవాలంటే చివరి రెండు లైన్లు గమనిస్తే అర్ధమవుతుంది.
“నా మతి మాలి దోషము జరిగే, ఓ వనమాలీ ఎద్దు నిన్ను పొడిచే పాపం అంతా నాదేనురా… కన్నా నిదురించరా….”
బాహుబలి కుంతలరాజ్యం వెళ్తాడు. దేవసేన తరుపున యుద్ధం చేస్తాడు. ఆ వార్ లో శత్రువులు ఎద్దులని వదులుతారు. ఈ వార్ చివరలో దేవసేన చేసే చిన్న పొరపాటు వల్ల, దేవసేనని కాపాడుతుంటే ఒక ఎద్దు బాహుబలిని పొడిచేస్తుంది. ఆ గాయానికి వైద్యమందించాక, నొప్పి వల్ల నిద్రరాదు. ఆ సమయంలో ఉన్న బాహుబలిని నిద్రపుచ్చటంకోసం, అక్కడవాళ్ళకి డౌట్ రాకుండా, ఇండైరెక్ట్ గా చిన్నికృష్ణుడి గెటప్ లో ఉన్న ఒక పిల్లోడిని పట్టుకుని, ఈ పాట పాడుతుంది. ఇంకేముంది సాంగ్ ఎండింగ్ లో బాహుబలి నిద్రపోతాడు.
3) ఒక ప్రాణం “ఒక ప్రాణం ఒక త్యాగం తెలిపిందా.. తన గమ్యం ..” ఈ ఒక్క లైన్లోనే సందర్భం పక్కా తెలుస్తోంది. అమరేంద్ర బాహుబలి ప్రజల బాగుకోసం మరణించాడని కట్టప్ప ద్వారా తెలుసుకొన్న శివుడు (మహేంద్ర బాహుబలి) రగిలిపోతాడు. అప్పుడు కుంతల రాజ్య ప్రజలతో కలిసి అతి భయంకరుడు అయిన భల్లాల దేవునిపై యుద్ధం ప్రకటిస్తాడు. ఆ సమయంలో వచ్చిన పాట ఇది. ఇందులో “రా రా రమ్మని పిలిచిందా రాజ్యం? ,, వరించగా జయం సాంతం” అంటూ మహిష్మతి రాజ్యం పిలుస్తున్నటుగా రచయిత కీరవాణి చెప్పారు.
WKKB: ఈ పాటలోనే బాహుబలి కట్టప్పను ఎందుకు చంపాడు? అనే ప్రశ్నకు జవాబు కూడా ఉంది. “ఒక ప్రాణం… “ఒక త్యాగం”… ఈ “త్యాగం ”అనే పదాన్ని గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే.. అందరు అనుకున్నట్లు కట్టప్ప బాహుబలిని చంపాడు. అది నిజమే. కానీ వెన్నుపోటు కాదు. ఎందుకు ? ఎవరి కోసం అనుకుంటున్నారా? మళ్ళీ ట్రైలర్ లోకి వెళదాం. “మహిష్మతీ ప్రజల ధన, మాన, ప్రాణాలను కాపాడటం కోసం, ప్రాణ త్యాగానికి కూడా వెనుకాడబోమని రాజమాత శివగామి సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను .” .. బాహుబలి ప్రమాణం చేసినట్లే ప్రాణ త్యాగానికి సంతోషం గా అంగీకరిస్తాడు.”
ట్రైలర్ లో కట్టప్ప బాహుబలిని పొడవటం నిజమే కానీ, ఆ ఒక్కకత్తి పోటుకే బాహుబలి చనిపోడు , బల్లాలదేవుని వల్ల మహిష్మతి ప్రజల ప్రాణాలు ఆపదలో ఉన్నాయి. బాహుబలిని చంపకపోతే రాజ్యంలో ప్రజలు బ్రతకరని చెప్పగానే బాహుబలి ఆదేశాల మేరకు కట్టప్ప బాహుబలిని పొడుస్తాడు. ఇదంతా రాజమౌళి మనల్ని పక్కదారి పట్టించడానికి వేసిన ప్లాన్. లేకపోతే కట్టప్ప చంపేస్తే బాహుబలి ఎందుకు హీరో అవుతాడు. ప్రాణత్యాగం చేశాడు కాబట్టే ప్రజలకి దేవుడు అయ్యాడు. ప్రజలు దండాలయ్యా పాట పాడుకున్నారు.
4) సాహోరే బాహుబలి సెకండ్ పార్ట్ లో కట్టప్ప మళ్ళీ ప్లాష్ బ్యాక్ మొదలెట్టగానే బాహుబలి ఇంట్రో ఉంటుంది. ఫస్ట్ లుక్ పోస్టర్ ఏనుగు పై బాహుబలి నిల్చున్న స్టిల్ గుర్తుందా?. అది ఈ పాటలోనిదే. బాహుబలి పట్టాభి షేకం జరిగే వేడుకలో వచ్చే పాట ఇది. అయితే ఇందులో మొదటి చరణం మొత్తం శివగామి, బాహుబలి మీద ఉంటుంది. తల్లి కొడుకుల మధ్య అనుబంధాన్ని హైలైట్ చేస్తూ పాట సాగుతుంది. దేవసేన వచ్చాక శివగామి, బాహుబలి మధ్య కొంత దూరం పెరుగుతుంది. దానికి ప్లాంటింగ్ గా ఇంత డ్రామా ముందే యాడ్ చేశారు రాజమౌళి.
5) హంస నావ బాహుబలి బిగినింగ్ లో శివుడు అవంతికను ఊహించుకొని దీవరా పాట వేసుకొని కొండా ఎక్కుతాడు. బాహుబలి కంక్లూజన్ లో రివర్స్. అమరేంద్ర బాహుబలి ప్రేమలో దేవసేన పడిపోతుంది. అప్పుడు ఆమె బాహుబలిని ఊహించుకొని అందమైన లొకేషన్లో డ్రీమ్ సాంగ్ వేసుకుంటుంది. అప్పుడు వచ్చిందే ఇది. ట్రైలర్ లో పెద్ద ఏనుగు విగ్రహం ముందు, ఒక హంసనావ వెళ్తున్న విజువల్ గుర్తుందా?, అది ఈ సాంగ్ బిట్ లోనే అయి ఉంటుంది. ఆ ఒక్క ఫ్రేమ్ తో ఈ సాంగ్ స్క్రీన్ మీద ఎంత గ్రాండ్ గా ఉంటుందో ఊహించుకోవచ్చు.
బాహుబలి 2 పాటలపై మా అభిప్రాయం ఇది. మీ అభిప్రాయాన్ని కూడా మీరు చేసుకోండి.